Flowers : మన హిందూ సంప్రదాయంలో పూలకు విలువ ఇస్తాం. దేవుడికి పూజ చేసేందుకు పూలు వాడతాం. ఆడవారు అందం కోసం పూలు జడలో ధరిస్తారు. పూల గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మనిషి జీవితంలో పెనవేసుకుపోయి ఉంటాయి. పెళ్లిలో పూలను అలంకరిస్తారు. చనిపోయినప్పుడు పూలు మీద చల్లుతారు. ఇలా మన దైనందిన జీవితంలో పూలకు మనకు చాలా సంబంధం ఉంటుంది.
పూలలో ఆయుర్వేద గుణాలు కూడా ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. మన ఆయుర్వేదంలో పూలతో నయమయ్యే రోగాలు కూడా ఉన్నాయని తెలుసా? అందుకే పూలతో మనకు అవినాభావ సంబంధం కలిగి ఉందని నమ్మాలి. వాటి వాడకంతో మనకు ఉండే రోగాలు దెబ్బకు నయమవుతాయి. కానీ మనమే వాటిని గురించి పట్టించుకోవడం లేదు. ఫలితంగా వ్యాధులు పెరుగుతున్నాయి.
పూలల్లో గులాబీ పూలంటే అందరికి ఇష్టమే. ప్రేమికులైతే తమ ప్రేమను వ్యక్తపరచేందుకు వీటిని వాడతారు. స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు. గులాబీ పూలను ఎండలో ఎండబెట్టి టీ, స్వీట్లు కానీ చేసుకుంటే క్యాన్సర్ నుంచి రక్షణ కలిగిస్తుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. అధిక బరువుతో బాధపడే వారికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. గులాబీ పూలను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మన అనారోగ్యాలు దూరమవుతాయి.
ఇంకా బొప్పాయి చెట్టు అయితే కల్పతరువే. దీని కాడ నుంచి పువ్వుల వరకు అన్ని మందుల్లో ఉపయోగపడతాయి. మధుమేహ రోగులకు ఇది మంచి మందులా పనిచేస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు దీని ఆకులు నమలడం ద్వారా వ్యాధి తీవ్రత తగ్గుతుంది. దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల గుండెకు మేలు చేస్తుంది. లివర్ ను కూడా కాపాడుతుంది. ఇన్ని సుగుణాలున్న బొప్పాయి పండును రెగ్యులర్ గా తీసుకోవడం చాలా మంచిది.
అరటి పువ్వు కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్య పరిరక్షణలో తోడ్పడుతుంది. అధిక బరువును నిరోధిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఫైబర్ మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. రక్తం పుట్టడానికి ఇది మంచి మందులా సాయపడుతుంది. అరటి పువ్వులో ఉండే ఔషధ గుణాలు తెలిస్తే మనం వాడకుండా ఉండలేం. అంతటి మహత్తర శక్తి గల అరటిపువ్వును మనం ఆహారంలో చేసుకుంటే చాలా ప్రయోజనం.