
జీవితంలో కష్టసుఖాలు, సుఖదుఖాలు సమానంగా ఉంటాయి. కష్టానికి కుంగిపోతూ సంతోషానికి పొంగిపోకూడదు. కష్టాలకు బాధ పడకూడదు. శారీరకంగా మానసికంగా సహనంతో ఉండాలి. ప్రస్తుతం అందరు ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఏది జరిగినా సింపుల్ గా తీసుకోవాలి. ప్రశాంతతతో ఉంటేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి నిద్రలేమి, ఆందోళన, రక్తపోటులో హెచ్చుతగ్గులు వంటి సమస్యలతో సతమతమవడం సహజం.
జీవితంలో జరిగే సంఘటనల గురించి ఆందోళన చెందడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎప్పుడు మనం ఆందోళన చెందుతుంటే మనశ్శాంతి లోపిస్తుంది. సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తి చేయడానికి ఆటంకం కలుగుతుంది. మితిమీరిన ఆలోచనల వల్ల ఇబ్బందులు వస్తాయి. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. నిద్రలేమి, మానసిక కుంగుబాటు, తలనొప్పులు వేధిస్తాయి.
ఇలా చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. శరీరంలోని రక్షణ వ్యవస్థ మందగిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. చింతనల నుంచి బయట పడాలి. ఎప్పుడు అవే ఆలోచనలతో ఉంటే కష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో మానసిక సమస్యలు అధికమవుతాయి. మెదడు కంట్రోల్ తప్పుతుంది.
ఈ నేపథ్యంలో అతిగా ఆలోచించడం మానుకోవాలి. చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి పెంచుకోవద్దు. శరీరంలో క్యాన్సర్ కణాల లక్షణాలు సోకే అవకాశం ఏర్పడుతుంది. దీంతో మనం ప్రశాంతంగా ఉంటే ఎలాంటి ముప్పు ఉండదు. మానసిక ప్రశాంతతో ఉంటే మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది.






