Indian spin Jodi : క్రికెట్లో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఒకరి రికార్డులు మరొకరు బద్ధలు కొట్టడం సహజమే. సచిన్ టెండుల్కర్ పేరు మీద ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును విరాట్ కోహ్లి బద్దలు కొట్టాడు. అదే బాటలో ఇప్పుడు బౌలర్ల వంతు అవుతోంది. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ జోడీ నెలకొల్పిన రికార్డును స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా సాధించడం గమనార్హం.
టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించారు. భారత్ తరఫున ఆడిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జోడీగా నిలిచారు. టెస్టుల్లో వీరిద్దరు 506 వికెట్లు తీయడం జరిగింది. 50 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇలా మన బౌలర్లు తమ సత్తా చాటడంతో అందరు ఫిదా అవుతున్నారు.
అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ 501 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచి అందరి అంచనాలు తలకిందులు చేశారు. హర్భజన్, జహీర్ ఖాన్ జోడీ 474 వికెట్లు, ఉమేష్ యాదవ్, అశ్విన్ కలిసి 431 వికెట్లు తీశారు. అంతర్జాతీయంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా ఇంగ్లండ్ కు చెందిన జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లు కలిసి 139 మ్యాచుల్లో 1039 వికెట్లు తీయడం వారి రికార్డే.
భారత్ లోని హైదరాబాద్ లో ఉప్పల్ వేదికగా జరుగుతున్న టెస్ట్ లో అండర్సన్ కు చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా దిగ్గజాలు షేన్ వార్న్, మెక్ గ్రాత్ 104 మ్యాచ్ ల్లో 1001 వికెట్లు తీశారు. దీంతో మనవారి కాంబినేషన్ లో అశ్విన్, జడేజా ఇలాంటి ఘనత సాధించడంపై పలువురు ప్రశంసలు కురిపించారు. క్రికెట్లో వారి జంట కలిగించిన సంచలనం గురించి పలు కామెంట్లు వచ్చాయి.