Mahesh ‘Spider’ సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో నటించిన మూవీ ‘స్పైడర్’.. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా 125 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ కు ఇది నిరాశ కలిగించింది.
మహేష్ బాబు మొదటిసారి తమిళ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు.. ఎస్ జె సూర్య ఈ సినిమాలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.. మరి ఎస్ జె సూర్య పెద్దయ్యాక విలన్ గా నటిస్తే ఈ సినిమాలో చిన్నప్పటి విలన్ రోల్ లో నటించిన బుడ్డోడు కూడా అందరికి గుర్తు ఉన్నాడు. మరి ఆ బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? అనే విషయాలు తెలుసుకుందాం..
మహేష్ రోల్ కు ధీటుగా విలన్ రోల్ ను మురుగదాస్ క్రియేట్ చేసాడు. కాలభైరవుడు రోల్ లో ఎస్ జె సూర్య అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో చిన్నప్పటి విలన్ గా నటించిన అబ్బాయి పేరు సంజయ్.. ఇతడు నటనతో బాగా మెప్పించాడు. సినిమా హిట్ కాలేదు కానీ హిట్ అయ్యి ఉంటే మరింత పేరు వచ్చేది..
స్మశానంలో పుట్టి పెరిగిన అబ్బాయిగా సంజయ్ అద్భుతంగా నటనతో ఆకట్టు కున్నాడు. ఇప్పటికి ఇతడిని స్పైడర్ సంజయ్ అనే పిలుస్తున్నారు. తమిళ్ ఇండస్ర్టీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఇప్పటికే పలు సినిమాలు చేసాడు.. ఇతడు చెన్నైలో జన్మించగా ఇతడికి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది.. కుట్టి టాకీస్ అనే పేరుతొ ఈ ఛానెల్ ను నడుపుతూ ఇందులో తన వీడియోలు, సినిమా అప్డేట్స్ వంటివి షేర్ చేస్తాడు.