Subbaraju Wife : నటుడు సుబ్బరాజు టాలీవుడ్లో క్యారిక్టర్ ఆర్టిస్టుగా, కామెడీయన్ గా, విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా సుబ్బరాజు 47ఏళ్ళ వయస్సులో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఆయన తన భార్యతో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. సుబ్బరాజు భార్య పేరు స్రవంతి. అమెరికాలోని ఫ్లోరిడాలోని నార్త్‌వుడ్ డెంటల్ సెంటర్స్‌లో డెంటిస్ట్‌గా ఆమె పని చేస్తోంది. కొలంబియా యూనివర్సిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి బీడీఎస్, డీడీఎస్, ఎంపీహెచ్ డిగ్రీలు పొందింది.
స్రవంతి ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్. ఆమెకు సైన్స్ విపరీతమైన మక్కువ. స్రవంతికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. తన ఫస్ట్ లవ్ సైన్స్ అని.. మ్యారీడ్ టు ఫిట్‌నెస్ అని స్రవంతి తన ఇన్‌స్టా బయోలో మెన్షన్ చేసింది. అమెరికాలోని ఫ్లోరిడాలో స్రవంతి కుటుంబం స్థిరపడింది. సుబ్బరాజు, స్రవంతి పెళ్లి . అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.