Corn health benefits: మన ఆరోగ్యానికి ధాన్యాలు ఎంతో ఉపకరిస్తాయి. అందులో మొక్కజొన్న కూడా ఒకటి. మొక్కజొన్నలతో చేసుకునే గడక తినేవారు పూర్వం రోజుల్లో. దీంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ కాలక్రమంలో వరి అన్నం వచ్చి చేరింది. దీంతో మొక్కజొన్నలను తినడం మానేశారు. కానీ ఇప్పుడు వాటినే తింటున్నారు. ఇందులో ఉండే పోషకాలతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రోగనిరోధక వ్యవస్థ బాగు చేయడానికి ఇవి దోహదపడతాయి. మొక్కజొన్న గింజల్లో 900 మైక్రో గ్రాముల యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కంటి ఆరోగ్యం బాగుంటుంది. వాపు, గుండె జబ్బు, క్యాన్సర్ల వంటి వ్యాధులు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సాయం చేస్తాయని చెబుతున్నారు.
మొక్కజొన్న గింజలతో తయారు చేసే నూనెలో ఫైటో స్టెరాల్స్ అనే సహజ పదార్థముంటుంది. ఇది శరీరం తక్కువ కొవ్వు గ్రహించుకునేలా చేస్తుంది. ఇందులో గుండెకు సహకరించే యుబిక్వినోన్ అనే విటమిన్ ఉంటుంది. గుండెకు ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడుతుంది. మొక్కజొన్న నూనె ఆరోగ్యానికి దోహదపడుతుంది. మొక్కజొన్న వల్ల మనకు చాలా లాభాలున్నాయి.
మొక్కజొన్నలో చక్కెర శాతం కూడా తక్కువే ఉంటుంది. ఇందులో 4 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. ఆపిల్ పండులో లభించే చక్కెరతో పోలిస్తే ఇది మూడో వంతు కన్నా తక్కువే. మొక్కజొన్నలో గ్లూటెన్ ఉండదు. మొక్కజొన్న గింజలతో తయారు చేసే కొన్ని పదార్థాల్లో గ్లూటెన్ కలుపుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
విటమన్లు, పోషకాలు బాగుంటాయి. కొవ్వు అసలు ఉండదు. అరకప్పు గింజల్లో లభించే పోషకాల్లో 97 కేలరీల శక్తి దాగి ఉంటుంది. 23 గ్రాముల పిండి పదార్థం ఉంటుంది. 0.78 గ్రాముల కొవ్వు ఉంటుంది. పీచు రెండు గ్రాములు ఉంటుంది. ప్రొటీన్ మూడు గ్రాముల వరకు ఉంటుంది. ఐదు గ్రాముల సోడియం దాగి ఉంటుంది. ఇలా మొక్కజొన్నలో ఎన్నో రకాల ప్రొటీన్లు ఉంటాయి.
ఇంకా 4 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. 40 మైక్రో గ్రాముల ఫోలేట్ ఉంటుంది. 32 మిల్లీ గ్రాముల మెగ్నిషియం ఉంది. 294 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. ఇలా మొక్కజొన్నలో మనకు సాయపడే అనేక రకాల విటమిన్లు దాగి ఉన్నాయి. దీంతో మొక్కజొన్నను రోజువారీ ఆహారంలో చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకుంటే మంచిది.