blood మన శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. దీన్ని ప్రతి గంటకోసారి కిడ్నీలు వడపోస్తాయి. లేకపోతే రక్తం చిక్కగా మారుతుంది. రక్తం పలచగా ఉండకపోతే మనకు రోగాలు వస్తాయి. బీపీ ఇలాగే వస్తుంది. రక్తపోటుతో అనేక రకాల సమస్యలొస్తాయి. మనం తినే ఆహారాలు జీర్ణం అయితేనే మనకు ఆరోగ్యం ఉంటుంది. రక్తం సరిపడ ఉండకోతే కూడా ఇబ్బందులొస్తాయి. రక్తం శుభ్రంగా లేకపోతే సమస్యలు రావడం సహజం. అందుకే రక్తాన్ని పరిశుభ్రం ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
రక్తాన్ని శుభ్రం చేయడంలో అవిసె గింజలు సాయపడతాయి. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాట్ 3 యాసిడ్లు మన శరీరానికి దోహదపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తం శుభ్రంగా అయ్యేందుకు సహకరిస్తాయి. బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ వంటి వాటిని తీసుకోవడం వల్ల రక్తం శుభ్రంగా మారుతుంది. గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా తోడ్పడతాయి.
సిట్రస్ ఫుడ్స్ తినడం వల్ల కూడా గుండె జబ్బుల ముప్పు రాకుండా చేస్తాయి. చిక్కుళ్లు, శనలు తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్య రాదు. చేపలు తినడం వల్ల కూడా రక్తనాళాలు ముడుచుకుపోకుండా చేస్తాయి. అందుకే వీటిని తినడం వల్ల గుండె పోటు సమస్యలు రాకుండా చేస్తాయి. రక్తం శుభ్రం కావడంతో గుండె జబ్బుల సమస్యను దూరం చేస్తాయి.
ఇలా మనం ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. ఇటీవల కాలంలో గుండెపోట్లు పెరుగుతున్నాయి. రక్తం శుభ్రంగా ఉండాలంటే మనం కచ్చితంగా ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె నరాలు బలంగా ఉండాలంటే మంచి ఆహారాలు తీసుకుంటే మంచిది. మన ఆరోగ్యం కాపాడుకోవడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందుకే వాటిని మనం తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది.