23.3 C
India
Sunday, August 9, 2026
More

    Sakunthalam flop : శాకుంతలం ప్లాఫ్ కు కారణాలేంటో తెలుసా?

    Date:

    Sakunthalam flop
    Sakunthalam flop

    Sakunthalam flop : సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన శాకుంతలం. ఫస్ట్ హాఫ్ ఆద్యంతం అద్భుతంగా ఉన్నా సెకండాఫ్ కొంచెం ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినిమా ప్లాఫ్ ను మూటగట్టుకున్నా గుణశేఖర్ దర్శకత్వ ప్రతిభ కనిపిస్తూనే ఉంది. గుణశేఖర్ మంచి రచయిత, దర్శకుడు కావడంతో ఆయన గత చిత్రాలన్ని ఎన్నో రికార్డులు మోగించాయి. దీంతో శాకుంతలం కూడా అదే కోవలో విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ చివరకు బెడిసికొట్టింది.

    శాకుంతలం అద్భుతమైన కథ. గుణశేఖర్ ఐడియాలజీ ఉన్న దర్శకుడు. దీంతో సినిమా బ్రహ్మాండంగానే తీసినా కొన్ని సీన్ ల వల్ల ఆకట్టుకోలేకపోయింది. శాకుంతలం కావ్యాన్ని కాళిదాసు రచించాడు. దాని కథతో సినిమా చేయాలని చాలా మంది అనుకున్నా అది గుణశేఖర్ కే సాధ్యమైంది. మహాభారంతో కూడా దీనికి సంబంధించిన కథ ఉంటుంది. భరత వంశం ఎలా మొదలైంది? భరతుడు ఎలా జన్మించాడు? గాంధర్వ వివాహం ఎలా జరిగింది? అనే కోణాల్లో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

    శకుంతలగా సమంత నటన బాగుంది. దుర్వాసుడిగా మోహన్ బాబు ఆకట్టుకున్నాడు. పాత్రల ఎంపికలో కూడా గుణశేఖర్ నప్పే వారినే తీసుకున్నాడు. కానీ కథలో కొన్ని మార్పులు చేయడం వల్ల సెకండాఫ్ దెబ్బతీసింది. శకుంతలను రాళ్లతో కొట్టే సన్నివేశం కాళిదాసు కావ్యంలో కనిపించదు. ఇందులో గుణశేఖర్ ప్రత్యేకంగా దాన్ని పెట్టడంతో బెడిసికొట్టిందా అనే అనుమానాలు వస్తున్నాయి.

    కథ, కథనం బాగుంది. స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. ఫస్ట్ పార్ట్ బాగుంది. సెకండాఫ్ కొన్ని మార్పులు చేసే సరికి ఊహించలేని విధంగా ప్లాఫ్ ను మూటగట్టుకుందని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలక్రిష్ణ అభిప్రాయపడ్డారు. సొంత డబ్బు పెట్టి రిస్క్ చేసిన గుణశేఖర్ ధైర్యానికి హాట్సాఫ్ చెప్పారు. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు చేయడం ఆయనకే చెల్లుతుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ‘శాకుంతలం’ చెత్త రికార్డ్స్.. వీకెండ్ కలెక్షన్ చూస్తే!

    నాగ చైతన్యతో కలిసి ‘ఏ మాయ చేశావే’తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన...