Dangerous Food : మనుషులు ప్రాణాలతో ఉండాలంటే ఆహారం తీసుకోవాలి. కొంత మంది శాఖాహారం తీసుకుంటారు. మరికొంత మంది మాంసాహారాలు తింటారు. ఎవరికి నచ్చింది వారు తినడం సహజం. కానీ శాఖాహారాలతోనే లాభాలు బాగుంటాయి. మాంసాహారం తినడం ఆరోగ్యానికి హానికరమే. కానీ ఎవరు వదిలిపెట్టడం లేదు. దీంతో రోగాల బారిన పడుతున్నారు. అయినా కేర్ చేయడం లేదు.
ప్రతి దేశంలో ఆ దేశానికి సంబంధించిన కొన్ని ఆహారాలుంటాయి. వాటిని తినడం వల్ల చాలా డేంజరే. కానీ వదిలిపెట్టరు. వాటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలు పోవడం ఖాయం. ఫుగు (పఫర్ ఫిష్) ఇది ఒక జపనీస్ వంట. జపాన్ లో విషపూరితమైన చేపలను వండుకుని తింటారు. వీటిని వండేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులో విఫలమైతే షెఫ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఏదైనా తప్పు జరిగితే మనిషి ప్రాణాలే పోతాయి.
చైనాలో బ్లడ్ క్లామ్స్ తింటారు. ఈ డిష్ ను తక్కువ ఆక్సిజన్ వాతావరణంలో నిల్వ చేయాలి. వీటిని తినడంలో పొరపాటు జరిగితే టైఫాయిడ్, హైపటైటిస్ వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదముంది. ఎరుపు రంగులో ఉండే కిడ్నీ బీన్స్ లో కూడా విషపూరితాలుంటాయి. నాలుగైదు పచ్చి కిడ్నీ బీన్స్ తింటే ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుంది. కిడ్నీ బీన్స్ తినడం చాలా ప్రమాకరం.
డర్డ్ వెస్ట్ సూప్ ప్రపంచంలోనే పురాతనమైనది. అత్యంత ఖరీదైనది. ఒక కప్పు బర్డ్ నెస్ట్ సూప్ సుమారు రూ. 10 వేలు ఖర్చవుతుంది. దీని విషయంలో పొరపాటు చేస్తే భారీ నష్టం కలుగుతుంది. పచ్చి జీడిపప్పును అందరు ఇష్టపడతారు. ఫిట్ నెస్ కోసం దీన్ని తీసుకుంటారు. పచ్చి జీడిపప్పును తినడం హానికరం. ఉరుషియోల్ అనే మూలకం ప్రాణాంతకమైనది.