
Reduce the heat : వేసవిలో వేడి పెరుగుతుంది. శరీరం వేడిగా ఉంటుంది. శరీరంలో వేడిని తట్టుకునే ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఎండాకాలంలో శరీరం డీ హైడ్రేడ్ కాకుండా ఉండాలంటే పుచ్చకాయ తింటే ఎంతో మంచిది. ఇందులో 90 శాతం నీరే ఉంటంది. అందుకే శరీరం చల్లగా మార్చడంలో ఇది ప్రధాన భూమిక పోషిస్తుంది. వేసవిలో చల్లగా చేసే ఆహారాల్లో దోసకాయ కూడా ఒకటి. దీంతో దీన్ని విరివిగా తినడం వల్ల లాభాలు ఉంటాయి.
కొబ్బరినీళ్లు కూడా శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఎలక్ర్టోలైట్స్ ను తిరిగి పొందడానికి కొబ్బరినీళ్లు బాగా ఉపయోగపడుతుంటాయి. శరీరాన్ని చల్లగా ఉంచడంలో ఇవి చాలా మేలు చేస్తాయి. కలబంద కూడా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో మంటలు తగ్గించడంలో సాయపడతాయి.
వేసవిలో మజ్జిగ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. శరీరాన్ని చల్లబరచడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. సిట్రస్ పండ్లు శరీరానికి మేలు చేస్తాయి. ఎండ వేడిని తట్టుకునేందుకు ఇవి శక్తిని ఇస్తాయి. ఆకుకూరల్లో కూడా మంచి ప్రొటీన్లు ఉంటాయి. పాలకూర, బ్రొకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి పచ్చని కూరగాయలు తినడం వల్ల శరీరం చల్లబడుతుంది.
పుదీనా కూడా శరీరాన్నిచల్లగా చేస్తుంది. పుదీనా జ్యూస్ తాగితే ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయలు కూడా మన శరీరాన్ని చల్లగా చేస్తాయి. వడదెబ్బ ముప్పు నుంచి రక్షిస్తాయి. ఒంట్లో వేడిని తగ్గించడంలో ఇవి ఎంతో ప్రభావం చూపుతాయి.