21 C
India
Sunday, February 25, 2024
More

  Tourist Places : భారత్ లో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఏంటో తెలుసా?

  Date:

  Tourist Places in India
  Tourist Places in India

  Tourist Places : భారతదేశం ఎన్నో అందాలకు ప్రసిద్ధి. అందమైన ప్రదేశాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. వాటిని చూస్తే ముచ్చటేస్తోంది. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు, సముద్ర తీరాలు, పర్వత ప్రాంతాలు, పచ్చని లోయలు, పచ్చిక బయళ్లు ఎటు చూసినా అందాలు మనల్ని సంతోష పెడతాయి. వాటిని చూడటం వల్ల మది పులకరిస్తుంది.

  కర్ణాటకలోని జోగ్ ఫాల్స్ అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఒకటి. ఇది షిమోగా జిల్లాలో ఉంది. శరావతి నది మీద ఈ జలపాతం ఏర్పడింది. రాజా, రాణి, రోవర్, రాకెట్ అనే నాలుగు విభిన్న జలపాతాల్లో 253మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతుంటే భలే అందంగా ఉంటుంది. నీరు కిందపడే శబ్ధం జోగ్ జలపాతాన్ని అద్బుతంగా చూపిస్తుంది.

  గుజరాత్ లోని థార్ ఎడారిని చూస్తే కూడా భలే గమ్మత్తుగా ఉంటుంది. రాన్ ఉత్సవంలో ఇక్కడ ప్రదర్శనలు జరుగుతుంటాయి. హస్తకళలు ఆకట్టుకుంటాయి. నీలి ఆకాశం సముద్రంలో ఉండే తెల్లని మబ్బుల్లా ఉప్పు ప్లాట్ లు అందంగా కనిపిస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో మంత్రముగ్దులను చేస్తాయి.

  ఉత్తర సిక్కింలో 17,800 అడుగుల ఎత్తులో గురుడోంగ్మార్ సరస్సు ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన సరస్సుకు గురు పద్మ సంభవ అనే పేరు ఉంది. బౌద్ధులు, సిక్కులు పవిత్రంగా చూసే ఈ సరస్సు చుట్టూ గంభీరమైన కాంన జంగాతో సహా మంచుతో కప్పబడిన పర్వతాలతో ఉన్న దీన్ని చూస్తే ముచ్చటేస్తోంది. సరస్సులోని నీలిరంగు నీరు చుట్టుపక్కల ఉన్న శిఖరాల అందాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి.

  జమ్ము కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ అనే సుందరమైన పట్టణం ఉంది. దట్టమైన అడవులు, లోయ గుండా ప్రవహించే లిడర్ నదితో ఈ ప్రాంతం సుందరంగా కనిపిస్తుంది. అమర్ నాథ్ గుహకు చెందిన ట్ెక్ తో సహా ఈ ప్రాంతంలోని అనేక ట్రెక్ లు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లలో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అద్భుతంగా ఉంటుంది.

  Share post:

  More like this
  Related

  TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

  TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

  Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

  Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

  SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

  SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

  Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Maldives President : మాల్దీవుల్లో అధ్యక్షుడిని మార్చితే రక్తాపాతమేనా?

  Maldives President : మాల్దీవులు ఇప్పుడు అనేక కష్టాలు ఎదుర్కొంటోంది. భారత్...

  Nehru : నెహ్రూ కి జలకిచ్చిన మన గొప్ప సైనికుడు

  Nehru : 1948 అప్పటి తాత్కాలిక ప్రధాని నెహ్రూగారు మిలిటరీ అధికారులను ఉద్దేశించి,...

  IT Recruitment : 21 శాతం క్షీణించిన ఐటీ నియామకాలు..

  IT Recruitment : భారత ఐటీ రంగంలో నియామకాలు 2022 డిసెంబర్...

  Maldives : మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ క్యాన్సిల్

  Maldives : ఇండియా శుభ్రంగా ఉండదని  అవమానించిన మాల్దీవులకు  ఈజ్ మై...