
ice cream : ఒక్కో కంపెనీ తయారు చేసే ఒక్కో ఐటంకు కాస్ట్ ను మనం ఊహించలేం. సాధారణ రేటు కంటే ఎక్కువ ఉంటుంది. ఇది కామనే కానీ మరీ టూ మచ్ కాస్ట్ అయితే ఎవరు కొంటారు..? ఎవరు తింటారు..? అనుకుంటే పొరబాటే మరి ఆ స్థాయిలో ఖర్చు చేసేవారు కూడా లేకపోలేదు. వేడుకలు, పార్టీల్లో వీటిని కొనుగోలు చేసి వారి స్థాయిని కూడా చాటుకుంటారు.
కోట్లు కుమ్మరించి కేకులు, ఇతర వంటకాలు చేసేవారు. ఇవన్నీ ఏదైనా రికార్డు కోసమే చేసేవారు. ఇవి రికార్డు తర్వాత కనిపించవు. కానీ ఇక్కడ ఒక ఐస్ క్రీం దాదాపు రూ. 5లక్షలకుపైగా ఉంటుందట. అయితే ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైనది. ఈ ఐస్ క్రీం వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. జపాన్ కు చెందిన ఓ కంపెనీ దీన్ని తయారు చేసింది. ఇప్పుడు ఇది నెట్టింట్లో వైరల్ గా మారుతుంది.
జపాన్ ఐస్ క్రీం కంపెనీ తయారు చేసిన ఐస్ క్రీంకు అక్షరాలా రూ. 5 లక్షలు. జపాన్ కంపెనీ దీన్ని అత్యంత ఖరీదైన ఇంగ్రీడియన్స్ తో తయారు చేసింది. ఇవి దొరకడం చాలా అరుదని, అందుకే దీనికి అంత కాస్ట్ ఉందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అల్బాలో పెరిగిన తెల్ల ట్రఫ్‌లెస్, పర్మిజియానో రెగ్జియానో మరియు సేక్ లీస్ అనే ఇంగ్రిడియన్స్ ఇందులో ఉపయోగించారు. అందుకే ఈ ఐస్ క్రీం ఇంత కాస్ట వరకూ ఉంటుందని తెలుస్తోంది.
అయితే దీన్ని కూడా కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున కష్టమర్లు వస్తారని కంపెనీ తెలిపింది. కానీ ముందస్తుగా ఆర్డర్లు తీసుకొని తయారు చేస్తామని.. స్టాక్ అనేది ఉండదని చెప్తుంది. ఏది ఏమైనా ఒక్క ఐస్ క్రీం కే రూ. 5 లక్షలు పెట్టే వారు కూడా ఉన్నరంటే నిజయంగా ఆశ్చర్యం కలుగక మానదు మరి.