బ్రహ్మానందం
హాస్య నటుడిగా అడుగు పెట్టిన ఆయన కొన్ని సినిమాల్లో హీరో పాత్రలు కూడా చేశాడు. కానీ టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం బ్రహ్మానందం అంటే కామెడియన్ గానే చూస్తారు. టాలీవుడ్ పరిశ్రమ ఉన్నన్ని రోజులు ఆయన కీర్తి దేశం నలుమూలలా ఉంటుంది. కమెడియన్లలో రాజబాబు పక్కన కుర్చీ వేసుకొని కుర్చునే స్థాయిని దాటి కూడా ముందుకు వెళ్లాడు బ్రహ్మానందం. గతంలో సినిమాల లెక్కన రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన ఇప్పుడు రోజుల లెక్కన చార్జి చేస్తున్నారు. రోజుకు ఆయన రూ. 5 లక్షల వరకు తీసుకుంటారట.
అలీ
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన అనేక సినిమాల్లో నటించారు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఆయన తర్వాత కమెడియన్ గా హీరోగా కూడా నటించారు. కానీ ఆయనకు కామెడీ మాత్రమే సూట్ అవుతుందని కామెడీ రోల్స్ లోనే నటిస్తున్నాడు ఆయన. ఆయన రోజుకు రూ. 3.5 లక్షలు తీసుకుంటున్నాడు.
వెన్నెల కిశోర్
యంగ్ జనరేషన్ కు బాగా దగ్గరైన కమెడియన్ వెన్నెల కిశోర్. ప్రతీ సినిమాలో ఆయన క్యారెక్టర్ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు వెన్నెల కిశోర్. ఇక సునీల్ కామెడీ పాత్రల నుంచి తప్పుకున్నాక ఆ స్థానాన్ని భర్తీ చేశారు వెన్నెల కిశోర్. ఆయన రోజుకు రూ. 3 లక్షల వరకు తీసుకుంటున్నాడు.
ప్రియదర్శి
ప్రియదర్శికి తెలుగు సినిమాలో మంచి మార్కెట్ ఉంది. కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా రాణిస్తున్నాడు ఆయన. మల్లేశం, బలగం సినిమాల్లో ఆయన హీరో క్యారెక్టర్ వేశాడు. కానీ కమెడియన్ గానే ప్రియదర్శి మనకు పరిచయం అయ్యాడు. జాతిరత్నాల్లో ఒక రత్నం కూడా ప్రియదర్శి. ఆయన రోజుకు రూ. 2 లక్షలు తీసుకుంటున్నాడు.
పోసాని కృష్ణ మురళి
కామెడీలో విలనిజం మిక్స్ చేసే సత్తా ఉన్న నటుడు పోసాని కృష్ణ మురళి. గతంలో రచయితగా బాగా రాణించిన ఆయన సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చారు. చాలా సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి మెప్పించారు. ఆయన రోజుకు రూ. 2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
ReplyForward
|