
Secret of Kumbha Karna : ఎవరైనా నిద్ర పోతే కుంభకర్ణుడిలా పండుకున్నావు అంటారు. రావణాసురుడి తమ్ముడు కుంభకర్ణుడు. అతడు ఆరు నెలలు తింటాడు. అరునెలలు పండుకుంటాడు. అది అతడి వరం. రామాయణంలోని ఉత్తరకాండలో ఈ విషయం గురించి రాశారు. రావణుడితో కలిసి విభీషణుడు, కుంభకర్ణుడు దైవానుగ్రహం కోసం తపస్సు చేస్తారు. అప్పుడు బ్రహ్మ ప్రత్య్షక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే కుంభకర్ణుడు ఇలా వరం కోరుకుంటాడు. అందుకే ఆరునెలలు తిండి, ఆరునెలల నిద్ర అతడికి అలవాటవుతుంది.
వరం అడిగే సందర్భంలో కుంభకర్ణుడు అమరత్వం కావాలంటాడు. కానీ అది సాధ్యం కాదని బ్రహ్మ వరం ఇచ్చేందుకు నిరాకరిస్తాడు. విభీషణుడు మాత్రం సరైన వరం కోరుకోవడంతో బ్రహ్మ సరే అంటాడు. అప్పటికే కుంభకర్ణుడితో ప్రజలంతా ఎంతో వేదన అనుభవిస్తుంటారు. దీంతో బ్రహ్మ కుంభకర్ణుడి నాలుక మీద సరస్వతి ఉండేలా చూడాలని చెబుతాడు.
వరం అడిగేటప్పుడు ఇంద్రుడి సింహాసనం బదులు నిద్రాసనం అని పలుకుతాడు. దీంతో అతడికి నిద్రను ప్రసాదిస్తాడు. కానీ ఆరునెలలు నిద్రపోయి ఒకరోజు తెలివితో ఉంటావని చెబుతాడు. రామ రావణ యుద్ధంలో కుంభకర్ణుడు తొమ్మిది రోజులకు నిద్ర లేస్తాడు.
ఇలా కుంభకర్ణుడు జీవితంలో ఎప్పుడు నిద్రలో ఉండేందుకు బ్రహ్మ వరం ఇవ్వడంతో అతడి ముప్పు ప్రజలకు లేకుండా చేయడానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని చెబుతారు. ప్రజల రక్షణ కోసమే బ్రహ్మ కుంభకర్ణుడితో అలా చెప్పించాడని పురాణాలు చెబుతున్నాయి.