Pallavi Prashanth :
బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవ్వడమే కాకుండా అప్పుడే ఫస్ట్ వీక్ అయిపోయింది. మొదటి వారమే ఎన్నో ట్విస్టులతో అలరించిన బిగ్ బాస్ చివరికి కిరణ్ రాథోడ్ ను ఎలిమినేట్ చేసాడు. ఇక ఇప్పుడు రెండవ వారం మరింత ఆసక్తిగా మారింది.. గత రెండు సీజన్స్ లలో బిగ్ బాస్ అలరించలేక పోవడంతో ఈసారి మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి రంగంలోకి దిగాడు.
ఈసారి వచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ లో రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఒకరు. మరి ఇతడు హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుండి కంటెస్టెంట్స్ తేలికగా చూస్తున్నారు.. కానీ సాధారణ ఆడియెన్స్ లో మాత్రం ఇతడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.. ఈయనకు ముందు నుండి మంచి ఓటింగ్ వస్తూ టాప్ లో ఉంటున్నాడు.
హౌస్ మేట్స్ కూడా ఈయన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని పసిగట్టి అందరు కలిసి ఈయనను టార్గెట్ చేసి రెండవ వారంలో నామినేషన్స్ లో ఉంచారు.. కానీ ఇతడికి మరింత ఫాలోయింగ్ పెరుగుతూ ఓటింగ్ కూడా పెరుగుతుంది. ఇక ప్రశాంత్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.. ఇతడు పేదవాడు కాదని కోట్ల ఆస్తి ఉందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వార్తల ప్రకారం పల్లవి ప్రశాంత్ కు ఊరిలో దాదాపు 26 ఎకరాల పొలం ఉందట.. అలాగే మంచి ఇల్లు, కారు కూడా ఉన్నాయట.. కానీ ఈయనకు వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండడంతో ఫార్మర్ గా మరి ఆ పనులకు సంబంధించిన వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అలాగే ఈయనకు లక్షల వ్యూస్ వస్తున్నా ప్రమోషన్స్ చేయడానికి ఇష్టపడడు అని ఆ విధంగా తనకు డబ్బులు సంపాదించడం ఇష్టం లేకనే ప్రమోషన్స్ చేయడం లేదట.. ఈ వార్తల్లో నిజం తెలియదు కానీ ఈ టాక్ ఇప్పుడు వైరల్ అయ్యింది..