Kalika Devi : దుష్టశిక్షణ శిష్ట రక్షణ భగవంతుడి విధి. లోకంలో చెడును నిర్మూలించి మంచిని వ్యాప్తి చేయడమే వారి ఉద్దేశం. లోకంలో ఎప్పుడు మంచి నశిస్తుందో అప్పుడు తాను కల్కి అవతారంలో వస్తానని భగవంతుడే చెప్పాడు. ఈ నేపథ్యంలో హిందూ, రోమన్, గ్రీకు సంప్రదాయాల్లో దేవుళ్లు, దేవతలకు దుష్ట శిక్షణ కోసం కొన్ని ఆయుధాలు ఉంచుకోవడం సహజమే. వాటితో చెడు ప్రవర్తన కలిగిన వారిని అంతం చేయడమే వారి కర్తవ్యం. దీంతోనే వారి ఆయుధాలకు పనిచెప్పి మంచిని వ్యాప్తి చేస్తుంటారు.
మన దేవుళ్లు, దేవతల చేతుల్లో ఆయుధాలు చూస్తుంటాం. ఆయుధాలు ధరించే దేవతల్లో గ్రామదేవతలు ముందుంటారు. వారి చేతుల్లో గదలు, కత్తులు, శూలాలు మనకు కనిపిస్తాయి. ఎవరైనా చెడు బుద్ధితో చెప్పినట్లు వినని వారిని వాటితో అంతం చేయడం వారి విధి. ఇలా వారి చేతిలో ఉండే ఆయుధాలను చూస్తే మనకు భయం కలుగుతుంది. ఇది సహజమే.
హిందూ ధర్మంలో దుష్టశిక్షణ కోసం కాళి, కాళికాదేవి, మహాకాళి, దక్షిణ కాళి, భద్రకాళి, శ్యామకాళి, చిన్మయ, కాపాలిని, ఘోరకాళి, రక్షకాళి, కమల కాళి, మాతంగి, భైరవి వంటి రూపాల్లో దర్శనమిస్తుంది. జానపదులు పూజిస్తున్న చౌడమ్మ, పెద్దమ్మ, కొల్లాపురమ్మ, చొప్పలమ్మ మొదలైన రూపాలు కాళికా దేవి అవతారాలే. కాళికా మాత చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, ఈటె, ధనస్సు, బాణం, కవచం, ముండమాల, కత్తి, గద, డమరుకం, నాగ, కమండలం, గంట, శంఖం, అర్థచంద్రాకార కొడవలి, అగ్ని తదితర ఆయుధాలు ఉంటాయి.
విశ్వంలో దాగి ఉన్న చెడును నిర్మూలించే క్రమంలో మనకు ఉన్న అజ్ణానాన్ని దూరం చేసుకునేందుకు అజ్ణానం, అంధకారం, అహం దూరం చేసుకోవాల్సి ఉంటుంది. మన మనసులో ఉండే దుష్టత్వాన్ని దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పతనమైపోతున్న సనాతన సంప్రదాయాలను రక్షించే నేపథ్యంలో ధర్మ ప్రతిష్టాపనకు ఆయుధాలు వాడాల్సిన అవసరం ఉంటుంది. చెబితే వినని వారిని కొడితే వింటారనే ఉద్దేశంతో మన దేవతల చేతిలో ఆయుధాలు ఉంచుకోవడం సహజమే.