Chiranjeevi : మెగాస్టార్ ఈ బిరుదుకు పెద్దగా గుర్తింపు అవసరం లేదు. కొణిదెల శివశంకర వరప్రసాద్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాధారణ వ్యక్తి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీనే శాసిస్తున్నాడంటే సందేహం లేదు. అంతటి గుర్తింపు, గౌరవం ఊరికే రాలేదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిలబడ్డారు ఆయన. కేరీర్ ప్రారంభంలో ఆయన వేసిన ప్రతీ ముల్లు పైననే చెప్పవచ్చు. ఆ అడుగులే ఇప్పుడు పూలబాటగా మారాయి.
ఎన్టీఆర్ జమానా తర్వాత చిరంజీవి జమానా ప్రారంభమైంది. ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించాయి. అందులో కొన్ని ఫ్లాప్ అయ్యయి కూడా దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు మెగాస్టార్. చేసిన ప్రతీ సినిమా సక్సెస్ కావాలని రూల్ లేదుగా.. అందులో కొన్ని డిజాస్టర్ సాధించినవి కూడా ఉన్నాయి. ఆయన కెరీర్ లో డిజాస్టర్ అయిన చిత్రాల గురించి చూద్దాం..
ఆచార్య:
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. కొణిదెల బ్యానర్ పై రాం చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. 2002, ఫిబ్రవరి 4న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లోనే భారీ ఫ్లాప్ మూవీ ఇదే.
సైరా నరసింహారెడ్డి
ఈ సినిమా కూడా కొణిదెల బ్యానర్ పై వచ్చిందే. రాం చరణ్ దీనికి కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. భారత స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడిగా పిలిచే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. 2019, అక్టోబర్ 2న రిలీజైన ఈ సినిమా కూడా ప్లాప్ కావడంతో రూ. 30 కోట్లు నష్టపోయారు రాం చరణ్.
శంకర్ దాదా జిందాబాద్
బాలీవుడ్ మూవీ ‘లగేరహో మున్నాభాయ్’ తెలుగులో ‘శంకర్ దాదా జిందాబాద్’గా రీమేక్ తీశారు. 2007, జూలై 27వ తేదీ రిలీజైంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
మృగరాజు
గుణశేఖర్, మెగాస్టార్ కాంబోలో వచ్చిన చిత్రం ‘మృగరాజు’. సిమ్రన్ హీరోయిన్ గా చేసింది. 2001, జనవరి 11వ తేదీన రిలీజైన ఈ సినిమా అడ్వెంచర్ మూవీగా గుర్తింపు దక్కించుకుంది. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా పడింది.
అంజి
కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ‘అంజి’. శ్యామ్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. 2004, జనవరి 15వ తేదీన రిలీజైంది. హై లెవల్ గ్రాఫిక్స్ యూస్ చేశారు. భారీ సన్నివేశాలు కూడా ఉన్నప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఇది కూడా డిజాస్టర్ గానే నలిచింది. ఈ చిత్రంలో మహేశ్ బాబు భార్య నమ్రత హీరోయిన్ గా చేసింది.
బిగ్‌బాస్
చిరంజీవి, రోజా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని విజయ బాపినీడు తెరకెక్కించారు. 1995, జూన్ 15వ తేదీన రిలీజైన ఈ సినిమా భారీ డిజాస్టర్‌ను ఎదుర్కొంది. భారీ తారాగణం ఉన్నా కథ, స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినీ అభిమానులు దీన్ని తిరస్కరించారు.
రిక్షావోడు
అలనాటి హీరోయిన్లు నగ్మా, సౌందర్య కలిసి చిరంజీవితో నటించిన సినిమా రిక్షావోడు. 1995, డిసెంబర్ 14వ తేదీన రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా భారీ డిజాస్టర్ ను ఎదుర్కొంది.
రాజా విక్రమార్క
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ఈ సినిమాలో అమల, రాధిక కలిసి చిరంజీవితో నటించారు. 14 నవంబర్, 1990లో రిలీజైంది ఈ మూవీ. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బిక్క మొహం వేసింది.
త్రినేత్రుడు
త్రినేత్రుడు మూవీని భారీ అంచనాల మధ్య తీశారు. చిరంజీవి హవా కొనసాగుతున్న వేల ఈ మూవీ తెరకెక్కింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాను నిర్మించారు. 22 సెప్టెంబర్, 1988లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. చిరంజీవికి ఇది 100వ సినిమా ఇది కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
జేబు దొంగ
కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘జేబు దొంగ’. రోజా మూవీస్ పతాకంపై ఎం అర్జునరాజు, ఎం రామలింగరాజు నిర్మించారు. 1987, డిసెంబర్ 25వ తేదీ ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇది కూడా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
లంకేశ్వరుడు
దాసరి నారాయణ రావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమా ‘లంకేశ్వరుడు’. సామాజిక సమస్యలను చిత్రీకరించడంలో గుర్తింపు దక్కించుకున్నారు దాసరి నారాయణ రావు. అలాంటి కథను ఎంపిక చేసుకొని ఆయన చిత్రాన్నితెరకెక్కించారు. 27 అక్టోబర్, 1989లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
రుద్రనేత్ర
దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రం ఇది. డిటెక్టివ్ చిత్రంగా దీన్ని తెరకెక్కించాడు దర్శకుడు. 16 జూన్, 1989లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ ను తీవ్రంగా నిరాశపరిచింది.