35.7 C
India
Friday, May 15, 2026
More

    Allu Aravind : చిరంజీవిని తిడితే అల్లు అరవింద్ ఏం చేశాడో తెలుసా?

    Date:

    Allu Aravind
    Chiranjeevi – Allu Aravind

    Allu Aravind : క్రమశిక్షణ, డెడికేషన్ కు మారుపేరు మెగాస్టార్‌ చిరంజీవి. కష్టపడితే ఎవరైనా  అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చని స్వయంగా నిరూపించారు మెగాస్టార్. దాదాపు 30 ఏళ్ల పాటు టాలీవుడ్ నంబర్ 1 హీరోగా  చెలామణి అయ్యారు.  ఎంతోమంది నటీనటులు, డైరెక్టర్లు, టెక్నీషియన్లకు మెగాస్టార్ ఒక ఇన్ స్పిరేషన్. ఆయన స్ఫూ్ర్తితో టాలీవుడ్ లో రాణిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. మెగాస్టార్ బాటలో ఆయన కుటుంబం నుంచి కూడా పలువురు హీరోలుగా రాణిస్తున్నారు.

    చిరంజీవి టాలెంట్,  సామర్ధ్యాన్ని గుర్తించిన ఒకప్పటి హాస్యట నటుడు అల్లు రామలింగయ్య.. ఆయనను అల్లుడిగా చేసుకున్నారు. డబ్బు, హోదా, పలుకుబడి విషయంలో అల్లు రామలింగయ్యతో చిరంజీవి ఆ సమయంలో సరితూగలేరు. అలాగే సురేఖకు ఎన్నో మంచి సంబంధాలు వచ్చినా చిరంజీవితో వివాహం చేయడానికే మొగ్గు చూపారు. 1980 ఫిబ్రవరి 20న అతిరథ మహారథుల సమక్షంలో చిరంజీవి – సురేఖల వివాహం చాలా ఘనంగా జరిగింది.

    ఇక బావ చిరంజీవి అంటే అరవింద్‌కు కూడా ఎంతో అభిమానం. ఆయనపై ఈగ వాలనివ్వరు. ఎవరైనా పల్లెత్తు మాట అన్నా కూడా సహించరు. చిరంజీవి కూడా అల్లు అరవింద్ కు  ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో ఒకసారి చిరంజీవిని ఓ వ్యక్తి అసభ్యంగా తిట్టడంతో సదరు వ్యక్తిని అల్లు అరవింద్ చితకబాదారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. అరవింద్ కుటుంబానికి అప్పట్లో దేవి శ్రీదేవి అనే థియేటర్  ఉండేది. దానిని సినీ పరిశ్రమకు చెందిన పలువరు రన్ చేసే వారు.

    అయితే అల్లు రామలింగయ్య, చిరంజీవి, శ్రీదేవి, రావు గోపాలరావు కాల్షీట్లు చూసే ఓ వ్యక్తి తాగిన మత్తులో అసభ్యంగా తిట్టాడని అరవింద్ తెలిపారు. ఓ రోజున బాగా మద్యం తాగి మత్తులో చిరంజీవిని అసభ్యంగా దూషిస్తుంచాడని, వారించినా వినలేదని చెప్పాడు.  చిరంజీవి దగ్గర పని చూస్తూ ఇలా మాట్లాడకూడదని వార్నింగ్ ఇచ్చాడు.  ఈ విషయం చిరంజీవి చేరడంతో ఆయన కూడా సీరియస్ అయ్యారట.

    ఈ నేపథ్యంలో శ్రీదేవి థియేటర్‌లో ఓ సినిమా చూసి బయటకు వస్తుండగా.. ఆ పెద్ద మనిషి మళ్లీ తాగొచ్చి చిరంజీవిని అలాగే తిట్టాడట. దీంతో సహనం కోల్పోయిన అల్లు అరవింద్ థియేటర్ మేనేజర్‌ని పిలిచి కళ్లజోడు, వాచ్ అతనికి ఇచ్చి.. సదరు వ్యక్తిని కాలర్ పట్టుకుని ఈడ్చుకొచ్చి కొట్టారట. ఈ గొడవ కారణంగా ఆయనకు 13 కుట్లు పడినట్ల అల్లు అరవింద్ గుర్తుచేసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Aravind : అల్లు అర్జున్ ఆ హిట్ సినిమాను వదులుకోవడానికి కారణం అల్లు అరవింద్ గారేనా..?

    Allu Aravind : అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభ దశలో కొన్ని కీలకమైన...

    Chiranjeevi : చిరంజీవి లైనప్ చూస్తే మెంటలెక్కిపోతారు..రామ్ చరణ్ కూడా వెనకబడ్డాడుగా!

    Chiranjeevi : సినిమా తర్వాత సినిమా, వరుసగా ఐదేళ్ల పాటు చిరంజీవి కాల్...

    Chiranjeevi : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో

    Chiranjeevi : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఒక కీలకపాత్రలో...

    Megastar Chiranjeevi : పవన్ కళ్యాణ్ ప్రసంగం చూసి కంటతడి పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి..వైరల్ ట్వీట్!

    Megastar Chiranjeevi : జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో...