33.4 C
India
Wednesday, May 21, 2025
More

    Sonia Deepti : కర్లీ బ్యూటీ శ్రావ్స్ ఏం చేస్తుందో తెలుసా?

    Date:

    Sonia Deepti
    Sonia Deepti

    Sonia Deepti  : టాలీవుడ్  క్లాస్ డైరెక్టర్  శేఖర్ కమ్ముల  ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శేఖర్ కమ్ముల చేసినవన్నీ దాదాపు చిన్న చిత్రాలే.  యూత్ ను దృష్టిలో పెట్టుకొని  చేసిన సినిమాలతో మరింత ఆకట్టుకున్నారు. తన సినిమాల్లో కొత్త వాళ్లను చాలా మందిని పరిచయం చేశాడు.  హ్యాపిడేస్, కొత్త బంగారు లోకం, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాల్లో దాదాపు అందరూ కొత్త వారే. ఈ సినిమాలతో కొత్త టాలెంట్ బయటికి వచ్చింది. ఎంతో మందికి  లైఫ్ ఇచ్చారు శేఖర్ కమ్ముల.

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ చిత్రాల్లో హ్యాపీ డేస్ ఒకటి. 2007లో విడుదలైన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. కొత్త నటీనటులతో తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇక ఇందులోని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. వరుణ్ సందేశ్, తమన్నాకు  బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా. ఇక వీరితో పాటు నటించిన టైసన్ (రాహుల్) శ్రావ్స్ (సోనియా దీప్తి) కి కూడా  మంచి పేరొచ్చింది.  అయితే ఈ సినిమాలో శ్రావ్స్ రోల్ అప్పట్లో కుర్రాళ్లకు బాగా నచ్చేసింది. రింగు రింగుల జుట్టుకు.. మధురమైన వాయిస్ కు అప్పట్లో యూత్ ఫిదా అయ్యారు. హ్యాపీ డేస్ సినిమాతో శ్రావ్స్ అలియాస్ సోనియాకు ఫాలోయింగ్ ఏర్పడింది.

    ఈ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసింది సోనియా. ఒకటి రెండు చిత్రాల్లో హీరోయిన్ గా చేసినా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సైడ్ రోల్స్ చేస్తూ వచ్చింది. సోనియాది హైదరాబాదే. కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లపాటు సాఫ్ట్ వేర్ జాబ్ కూడా చేసింది. ఓ ప్రమోషన్ ఈవెంట్లో సోనియాను చూసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమాలో తీసుకున్నారు. ఈ సినిమా సోనియాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత వినాయకుడు, బ్రహ్మా లోకం టూ యమలోకం వయా భూలోకం తదితర చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. అలాగే కార్తీ ఆవారా, మహేష్ బాబు దూకుడు సినిమాల్లో సైడ్ రోల్స్ చేసింది. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.
    2016లో చిన్ని చిన్నీ ఆశలు నాలో రేగేనే  సినిమాలో చివరి సారిగా తెరపై కనిపించింది. ఆ తర్వాత ఏడాది తమిళంలోనూ ఒక సినిమా చేసింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఇండస్ర్టీకి దూరమైంది. ఇటీవల అనుష్క, నవీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మళ్లీ తెరపై కనిపించింది.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nani : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాని: కథాంశం ఏమిటంటే!

    Sekhar Kammula : నాని, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఒక చిత్రం రాబోతున్నట్లు...

    Tamannaah : అలాంటి సీన్లకు ఇంట్రస్ట్ చూపుతున్న తమన్నా.. దీని వెనుక పెద్ద ప్లానే వేసిన మిల్కీ బ్యూటీ

      Tamannaah 2005లో కెరీర్ ప్రారంభించిన తమన్నా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్...

    Appu : హ్యాపీడేస్ అప్పు.. ఇప్పుడెలా ఉందంటే?

    డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీ హ్యాపీడేస్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది....

    హ్యాపీడేస్ సెకండ్ హీరోయిన్ ఎలా ఉందో తెలుసా..

    ‘జూనియర్స్ సీనియర్స్ కు చెప్పకూడదు’ ఈ డైలాగ్ గుర్తుందా.. బాగా ఫేమస్...