
sugar control : మధుమేహం విస్తరిస్తోంది. చాలా మందిని కబళిస్తోంది. దీంతో ఏం చేయలో కూడా అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో షుగర్ పేషెంట్లు కొన్ని రకాల పండ్లు తినడం ద్వారా డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహం ఉన్న వారు తినే పండ్లలో ఏమేమి ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం.
పీచ్ పండ్లు
షుగర్ ఉన్న వారికి పీచ్ పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఇందులో 59 కేలరీల శక్తి ఉంటుంది. 10 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఈ పండులో 285 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సాయపడుతుంది.
బెర్రీస్
షుగర్ ను కంట్రోల్ లో ఉంచే పండ్లలో బెర్రీస్ ముఖ్యమైనవి. ఇందులో స్ట్రా బెర్రీస్, బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ అని రకరకాలుగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి షుగర్ ను అదుపులో ఉంచుతాయి.
ఆఫ్రికాట్
డయాబెటిస్ ను తగ్గించడంలో ఆఫ్రికాట్ పండు కూడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు షుగర్ ను నియంత్రణలో ఉంచడంలో సాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఇలా మధుమేహాన్ని తగ్గించడంలో ఇవి కూడా ఎంతో మేలు చేస్తాయి.