నెలకు రెండు చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఆషాఢ మాసంలో మొదటిగా వచ్చేదాన్ని తొలి ఏకాదశిగా పిలుస్తారు. క్షీర సాగర మథనంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై నాలుగు నెలల పాటు నిద్రిస్తాడు. తిరికి నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజు నిద్ర నుంచి లేస్తాడు. దీన్ని చాతుర్మాస వ్రతంగా కూడా చెబుతుంటారు. ఈ వ్రతం కూడా ఏకాదశి రోజు మొదలవుతుంది. అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. దీన్ని దేవ శయన ఏకాదశిగా లేదా హరిశయన ఏకాదశిగా పేర్కొంటారు.
విష్ణువు నిజంగా నిద్రపోతాడా? ఒకవేళ ఆయన నిద్రపోతే ప్రపంచం ఎలా నడుస్తుంది అనే సందేహాలు అందరిలో వస్తాయి. భగవంతుడు నిద్రపోతే భక్తుల సమస్యలు ఎవరు తీరుస్తారు? ఇదో ఆచారం. ఈ పండగ రోజు ఉపవాసం చేయాలి. జాగారం ఉండాలి. మంచంపై కూర్చోకూడదు. మాంసాహారం తినకూడదు. ఆడవారి సాంగత్యం చేయకూడదు. ఇలా చాలా నిబంధనలు ఉన్నాయి.
ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది. దీని తరువాత శ్రావణం. ఇది నెల రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో పూజలు చేయడం మామూలే. చాతుర్మాస దీక్ష తీసుకున్న వారు నాలుగు నెలల పాటు కఠినంగా ఉండాలి. అప్పుడే ఆ వ్రతం విజయవంతం అవుతుంది. నాలుగు మాసాల్లో శుభ కార్యాలు చేయొద్దు. ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంయమనం పాటించాలి.