Sea Womb :
ఎన్నో రహస్యాలను తన కడుపులో పెట్టుకుంటుంది సముద్రం. లోతుకు వెళ్లినా కొద్దీ ఒక్కో ఆశ్చర్యకరమైన విషయం బయటపడుతుంది. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు సముద్రంలోని కొంత దూరం వరకే వెళ్లగలిగారు.. అంతకు మించి వెళ్లలేదు సరికాదా.. కనీసం రోబాట్లను కూడా పంపడం కష్టమే.
సముద్ర గర్భంలోకి 750 మీటర్ల లోతుకు సబ్‌మెరైన్ వెళ్తే.. దానిలో భయంకరమైన విస్పోటనం జరుగుతుంది. సబ్ మెరైన్ పూర్తిగా విధ్వంసమవుతుంది. ఒకవేళ ఓ మనిషి వెళ్లాలని చూస్తే కిలో మీటర్ వరకు ఆక్సిజన్ అవసరం లేకుండా వెళ్తే ఊపిరితిత్తులు పగిలి పోతాయి. మనిషి ఇంత వరకు సముద్ర గర్భంలోకి 11 కిలో మీటర్ ల లోతులో ఉన్న ఛాలెంజర్ డీప్ అనే ప్రాంతాన్ని మాత్రమే కనిపెట్టగలిగాడు. ఇది అతి ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని సముద్రంలో రివర్స్ లో పెట్టినా కూడా ఈ ఛాలెంజర్ డీప్ ను అందుకోలేదు.
భూమిపై జీవం సముద్రాల వల్లే ఏర్పడిందని చరిత్ర చెప్తుంది. సముద్రంలో అనేక రకాల సూక్ష్మజీవుల కలయిక వలన జీవం పుట్టింది. అది రాను రాను కొన్ని కొన్ని మార్పులకు గురవుతూ సముద్రంలో తిమింగలాల నుంచి భూమిపై బయంకరమైన డైనోసార్ వరకు జరిగింది. అందులో మనిషి కూడా ఒక జీవి. సముద్ర గర్భంలో ఒక్కో స్థాయిలో కొన్ని రకాల జంతువులు నివసిస్తుంటాయి. కొన్ని వెలుగు కోసం పై భాగంలో ఉంటే మరి కొన్ని సముద్ర గర్భం అడుగున కూడా ఉంటాయని శాస్త్ర వేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అక్కడికి యంత్రాన్ని గానీ, మనిషిని గానీ పంపలేదు. భూమిపై 71 శాతం నీరు ఉంది. ఇందులో కేవలం 5 శాతం మాత్రమే మనం చూడగలిగాం. ఇందులోనే కొన్ని కోట్ల జీవులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మిగతా నీటిలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అహర్నిషలు కష్టపడుతున్నారు.
పసిఫిక్ సముద్రంలో ఉన్న మారియానా ట్రెంచ్ లోని ఛాలెంజర్ డీప్ అనే ప్రాంతాన్ని భూమిపై ఉన్న లోతైన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించారు. దీని లోతు సుమారు 11 కిలో మీటర్లు. ఇక్కడికి సూర్య కిరణాలు కూడా చేరుకోలేవు. ఇక్కడ చాలా చీకటిగా ఉంటుంది. ఇక్కడ నీటి ప్రవాహ ఒత్తిడి ఎక్కువ ఉండి ఇక్కడికి చేరుకోవడం అంటే గొప్ప సాహసమే. కేవలం 8 మంది గల టీం మాత్రమే అక్కడకి చేరుకొని తిరిగి మళ్లీ ప్రాణాలతో బయటకు వచ్చింది. కేవలం ఒక ఛాలెంజర్ డీప్ తోనే సముద్రం లోతును అంచనా వేయలేము. ఈ సముద్రంలో మనకు ఊహకు అందని ఎన్నో రహస్యాలున్నాయి. సముద్రంలోని అడుగు భాగంలో అనేక నదులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.