Dream : ప్రతీ జంతువుకు కలలు సాధారణమే అని నిపుణులు చెప్తుంటారు. కలలు అనేవి మనం ఆలోచనను బట్టి వస్తాయని చెప్తుంటారు. ఒక్కోసారి ఇది నిజం కాకపోవచ్చు కూడా.. మన ఆలోచనలకు విరుద్ధంగా కూడా వస్తుంటాయి. వాటి గురించి ప్రత్యేక శాస్త్రమే ఉందంటే కలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అవి మన జీవితంపై కూడా ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అయితే కలల శాస్త్రంలో కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సైకాలజిస్టులు కూడా వారి మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు కలల గురించి తెలుసుకుంటారు. అయితే మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందట. రాత్రి వచ్చే కలలు మన నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తాయంటారు. తేలికగా వచ్చే కలకు చాలా అర్థాలు ఉంటాయి. యువతి కలలో వివస్త్రగా (నగ్నంగా) కనిపిస్తే దేనికి సంకేతం? జీవితంలో ఏం జరుగుతుందో అని చాలా మందికి అనుమానం కలుగుతుంది. దాని గురించి తెలుసుకుందాం.
* కలలో యువతి వివస్త్రగా కనిపిస్తే.. ఎవరైనా స్త్రీ మీకు నచ్చిందని, ఆమెతో మీరు ఉండాలని అనుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. దీంతో పాటు వారి భద్రతపై కూడా మీరు శ్రద్ధ పెడతారు.
* పురుషుడు తను ఇష్టపడిన స్త్రీని నగ్నంగా చూస్తే. అతను ఆ స్త్రీ పట్ల ఆకర్షణతో ఉన్నాడని అర్థం. మీరు మానసికంగా ఆమెకు దగ్గరగా ఉన్నారనే భావనకు గుర్తు ఈ కల.
* మీరు స్త్రీతో నగ్నంగా మాట్లాడుతున్నట్లు కలగంటే మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు అని అర్థం. కొంత కాలంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని అర్థం చేసుకోవాలి.
* మీరు కోల్పోయిన వ్యక్తి మీ కలలో నగ్నంగా కనిపిస్తే త్వరలో మీరు వివాహ జీవితంలోకి ప్రవేశించబోతున్నారని అర్థం చేసుకోవాలి. పెళ్లి సమయం ఆసన్నమైందని కూడా శాస్త్రంలో పేర్కొన్నారు.