Uday Kiran’s wife Vishita ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి కాలం కలిసి రావడం లేదని సూసైడ్ చేసుకున్న నటుడు ఉదయ్ కుమార్. ఉదయ్ కిరణ్ గురించి ప్రస్తుత జనరేషన్ కు అంతగా తెలియకపోవచ్చు. మొదటి మూడు సినిమాలు హిట్ కావడంతో హ్యాట్రిక్ హీరో అని ముద్ర వేసుకున్నాడు ఈ లవర్ బాయ్. ఈ హ్యాట్రిక్ విజయంతో ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలకు ధీటుగా నిలిచాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ అనతికాలంలోనే తెరమరుగుతో పాటు ఈ లోకాన్ని కూడా విడిచి వెళ్లిపోయాడు. అయితే ఆయన అప్పటికే విషితను వివాహం చేసుకున్నాడు. మరి విషిత ఇప్పుడు ఏం చేస్తోంది? ఎక్కడ ఉంది? అనే విషయాలను చూద్దాం.
లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న ఆయన ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత కథల విషయంలో పొరపాట్లు చేయడంతో హ్యాట్రిక్ హీరో కాస్తా కేరాఫ్ ఫ్లాప్ గా మారాడు. ఆ బాధను భరించలేక శ్రీనగర్ కాలనీలోని తన అపార్ట్‌మెంట్ లో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. అపార్ట్ మెంట్ లో సూసైడ్ లెటర్ లాంటివి ఏవీ దొరకలేదు. దీంతో ఆయన సూసైడ్ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.
ఇక ఆయన భార్య విషిత గురించి తెలుసుకుంటే.. ఆమె అప్పుడు సాప్ట్ వేర్ జాబ్ చేసేది. ఉదయ్ కిరణ్ సినిమాల విషయలో డీప్రెషన్ ఎదుర్కోంటుండగా ఆమెనే వైద్యుల వద్దకు తీసుకెళ్లేది. ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతటి స్టార్‌డమ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఆయనను గుర్తుకు చేసుకునే వారు లేకపోలేదు. విషిత మాత్రం ఉదయ్ తనను విడిచి వెళ్లిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా తన జాబ్ చేస్తూ.. వచ్చిన డబ్బులను వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలకు ఇస్తూ గడుపుతోంది. ఉదయ్ కిరణ్ తప్ప మరొకరిని తన భర్తగా ఊహించుకోలేకపోతుందట విషిత.