Chaturmasya Deeksha Rules :
నేడు తొలి ఏకాదశి సందర్భంగా చాతుర్మాస దీక్షలు చేపడతారు. నాలుగు నెలలు ఒంటి పూట భోజనం, నేలపై నిద్రిస్తారు. నిష్టగా దేవున్ని పూజించాలి. మాంసాహారానికి దూరంగా ఉండాలి. మద్యం సేవించరాదు. ఇలా చాతుర్మాస దీక్ష చేయడం ఒక నిష్టగా చేస్తారు. స్త్రీ సాంగత్యం ఉండకూడదు. పొద్దున్నే లేచి స్నానం చేయాలి. దేవుడిని పూజించాలి. చాతుర్మాసం నేటి నుంచి నాలుగు నెలల పాటు అంటే నవంబర్ వరకు ఉంటుంది.
ఈ ఏడాది చాతుర్మాసం విశిష్టమైనదిగా చెబుతున్నారు. 19 సంవత్సరాల తరువాత శ్రావణమాసం అధిక మాసం కావడంతో నాలుగు నెలలు కాదు ఐదు నెలలు ఉంటుంది. ఈ కాలంలో వేడుకలు, శుభ కార్యాలు జరుపుకోకూడదు. దేవుడిని మాత్రం పూజించాలి. నియమాలు పాటించాలి. చాతుర్మాస విశిష్టత తెలుసుకుని ప్రవర్తించాలి. లేకపోతే మనకు ఇబ్బందులొస్తాయి.
చాతుర్మాసంలో నిష్టగా ఉండాలి. భగవంతుని ధ్యానంలోనే గడపాలి. ఉపవాసాలు ఉండాలి. నేలపైనే నిద్రించాలి. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కుదరకపోతే ఫరవాలేదు. కానీ అన్ని సవ్యంగా ఉంటే మాత్రం నిబంధనలు కచ్చితంగా పాటిస్తేనే మంచిది. సూర్యోదయానికంటే ముందే మేల్కోవాలి. మనసు దేవుడి మీదే లగ్నం చేయాలి. ఈ కాలంలో నిశ్శబ్దంగా ఉండటమే మంచిది.
చాతుర్మాస కాలమంతా పరమనిష్టతో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. సూర్య నమస్కారాలు చేయాలి. ఉదయం, సాయంత్రం రెండు పూటలా విష్ణువు, శివుడిని పూజించాలి. దానధర్మాలు చేయాలి. ఎవరికైనా అనాథలకు ఆశ్రయం కల్పించడం మంచిది. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. రాత్రి సమయాల్లో పండ్లు తింటే ఇంకా మంచి జరుగుతుంది.