Comedian Jagan :
పవన్ కల్యాణ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా తొలిప్రేమ. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో వండర్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో నవ్వుల పూలు పూయించాడు. సినిమాలో హాస్యం ఆసక్తికరంగా ఉంటుంది. పవన్ కు 4కె క్వాలిటీకి మార్చి విడుదల చేయగా ఇప్పటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. యూత్ లో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
సినిమాలో ప్రతి సన్నివేశం అందరిని ఆకట్టుకుంటుంది. దర్శకుడు కరుణాకరన్ ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు. పవన్ కల్యాణ్ స్నేహితుల్లో మసిబొగ్గు శ్రీను పాత్ర చేసిన వ్యక్తి పేరు జగన్. అతడు అందరికి గుర్తుండే ఉంటాడు. ఇతడు కరుణాకరన్ కు బాగా కావాల్సిన వ్యక్తి కావడంతో తన మొదటి సినిమాలో అతడికి అవకాశం ఇచ్చాడు.
అతడి ఇష్టాన్ని గమనించి చాన్స్ ఇచ్చాడు. ఆ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న అతడు ఇక ఏ సినిమాలో కనిపించలేదు. చెన్నై ప్రాంతానికి చెందిన అతడు సినిమాలకు దూరంగా ఒక బ్యాంక్ ఎంప్లాయిగా పనిచేస్తున్నాడు. కమెడియన్ గా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యే వెసులుబాటు ఉన్నా ఉద్యోగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు.
కొందరు సినిమా హిట్టయిందంటే చాలు సినిమాల్లోనే సెట్ కావాలని కోరుకుంటారు. కానీ అతడు మాత్రం తన ఉద్యోగం కావాలని కోరుకున్నాడు. ఇలా తొలిప్రేమలో అందరిని అలరించిన జగన్ తరువాత కూడా సినిమాల్లోకి రాకుండా ఉంటున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ మరోమారు సినిమాల్లో కనిపిస్తాడో లేదో తెలియడం లేదు.