
Global Threats : ప్రపంచం ప్రతి ఏటా కొన్ని ఆపదలను ఎదుర్కొంటుంది. వాటిని గురించి ప్రపంచ ఆర్థిక వేదిక ఓ నివేదిక రూపొందిస్తుంది. ఆ ఏడాది భూ ప్రపంచం ఎదుర్కొనే సమస్యల గురించి వివరిస్తుంది. ఏడాదిలో మనం ఎదురయ్యే సమస్యలతో పోరాటం చేయాల్సి వస్తుంది. దీంతో ఈ ఏడాది మనం ఎలాంటి ముప్పును ఎదుర్కోబోతున్నామో తెలుసుకుందాం.
భూతాపం వల్ల భూమి వేడెక్కిపోతోంది. దీంతో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం మరింత ప్రమాదం పొంచి ఉండే అవకాశముంది. సాంకేతికత ఎంత పెరుగుతుందో అంతే వినాశనం కూడా జరుగుతుంది. దీని ప్రభావం కూడా మనపై తీవ్రంగా ఉంటుంది. ఉగ్రదాడులు పెరిగే ముప్పు ఉంటుంది. ఆకలి కోసం అలమటించే ప్రమాదం కూడా ఉంది.
రాజకీయాలు కూడా మారుతున్నాయి. దేశాల మధ్య విభేదాలు తలెత్తి యుద్ధానికి దారితీయొచ్చు. దీని ఆధారంగా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఏర్పడుతుంది. నగర జనాభా పెరుగుతుంది. కానీ వారి ఆదాయం మాత్ం పెరగడం లేదు. దీంతో జీవన వ్యయం పెరిగి సంక్షోభాలు ఏర్పడవచ్చు. ఫలితంగా జీవనం కూడా కష్టంగా మారే ప్రమాదముంది.
సైబర్ దాడులు పెరిగే ఆస్కారం ఉంటుంది. ప్రజలు దాచుకున్న సొమ్మును వివిధ మార్గాల్లో కొట్టేయడానికి దొంగలు యత్నిస్తారు. బ్యాంకుల్లో డబ్బులు ఉంచుకున్న వారు భయపడాల్సిందే. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఫలితంగా దేశాలు దుర్భిక్షం ఎదుర్కొంటాయి. ఆర్థిక మాంద్యం కొత్త చిక్కులు తెచ్చి పెడుతుంది.
వివిధ కారణాలతో దేశాల మధ్య వస్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఆయా దేశాల మధ్య వ్యాపార లావాదేవీలు జరిపే అవకాశం దక్కదు. దీంతో ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఇంకా కొన్ని దేశాల మధ్య విభేదాలు ఏర్పడి యుద్ధ వాతావరణం నెలకొంటుంది. దీని వల్ల మనకు తీవ్ర నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది.