
ప్రతి సంవత్సరం జేష్టమాసంలో వచ్చే అమావాస్య రోజు శని జయంతి వస్తుంది. ఈ సంవత్సరం మే 19న వని జయంతి వస్తోంది. దీంతో శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శని వల్ల ఏర్పడే దుష్ర్పభావాల నుంచి కాపాడుకోవడానికి పూజలు చేస్తుండాలి. శని దోషాలు తొలగిపోవడానికి పలు రకాల పూజలు చేస్తే మంచిది.
శని జయంతి రోజు శనిని నిష్టగా పూజ చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు. శనికి ఇష్టమైన పనలు చేయడం వల్ల కూడా శని అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే బాధలను శని దూరం చేస్తాడు. శనిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకు కలిగే బాధల నుంచి విముక్తి కలిగిస్తాడు. అన్ని దోషాలు తొలగాలంటే శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాల్సిందే.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు శని దేవుడికి పూజలు చేసుకోవచ్చు. శని జయంతి మే 18 రాత్రి 9.44 గంటల నుంచి మే 19 రాత్రి 9.20 గంటల వరకు ఉంటుంది. అందుకే ఈ సమయంలో శని దేవుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం మన మీద కలుగుతుంది. ఫలితంగా మనకు మంచి జరుగుతుంది.
శని జయంతి రోజు దానాలు చేస్తే కూడా మంచి శుభాలు కలుగుతాయి. ఈ రోజు నల్లని వస్తువులు దానం చేయడం ఉత్తమం. ఎంతో శుభప్రదంగా ఉంటుంది. జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. శని జయంతి రోజు దానాలు చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. శని జయంతి రోజు శనిదేవుడి మంత్రాన్ని జపిస్తూ దానధర్మాలు చేయడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయని నమ్ముతారు.






