Shani Trayodashi :
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శని త్రయోదశి వస్తుంది. శనివారం త్రయోదశి కావడంతో దీన్ని శని ప్రదోష వ్రతం అని అంటారు. శివుడితో పాటు శని ప్రదోష వ్రతం రోజున శని దేవుడిని కొలుస్తారు. శని ప్రదోష వ్రతం పాటించడంతోనే కష్టాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇంట్లో మంచి జరగాలంటే శని ప్రదోష వ్రతం చేస్తుంటారు. ఆషాఢ మాసంలో వచ్చే శని త్రయోదశికి మంచి ప్రాముఖ్యత ఉంటుంది.
ఈ నెలలో వచ్చే శని త్రయోదశి రోజు మంచి ఫలితాలు వస్తాయి. దీనికి మనం శని ప్రదోష వ్రతం చేయడం మంచిది. కర్మలను బట్టి దేవుడు మంచి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ రోజు మనం చేయవలసిన పూజలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల శని బాధలు తొలగుతాయి. శనితో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటారు. మనం శనిని వదిలించుకోవడానికి మొగ్గు చూపుతుంటాం.
ఈ రోజు నల్ల చీమలకు పంచదార ఆహారంగా వేయడం మంచిది. చీమలు కనిపించకుంటే అవి ఉండే ప్రాంతానికి వెళ్లాలి. చెట్టు మూల దీపం పెడితే శ్రేయస్కరం. నల్ల నువ్వులు, నువ్వుల నూనె శనికి మేలు చేస్తుంది. మనం శనిని పూజించే టప్పుడు మనకు మంచి ఫలితాలు రావడం చూస్తుంటాం. శని ఆరాధనతో పాటు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి కృప మనకు లభిస్తుంది.
11న శనివారం పుప్పింటి చెట్టుకు పూజలు చేసి ప్రదక్షిణలు చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది. ఆలయానికి వెళ్లి నవగ్రహాల్లో శని దేవుడి ఎదుట దీపం వెలిగించడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని నమ్ముతుంటారు. ఇలా శని భగవానుడిని సాధ్యమనంత వరకు మనకు ఇబ్బందులు రాకుండా పోతాయి. దీంతో ఈ పరిహారాలు పాటించి శని బాధలను విముక్తి చేసుకోవచ్చు.