
Beautiful : ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలనే ఆశ ఉంటుంది. ఆ దిశగా ఎన్నో ప్రయాసలు పడుతుంటారు. సౌందర్య సాధనాలు వాడుతుంటారు. కానీ ఏది కూడా ఫలితం చూపించదు. దీంతో నిరాశ చెందుతుంటారు. కానీ అందంగా ఉండాలనే ఆశ అందరిలో సాధారణంగానే ఉంటుంది. దీని కోసం ఏవేవో వాడి ఫలితం లేదని నిట్టూరుస్తారు. సహజసిద్ధంగానే మనం అందంగా కనిపించొచ్చనే విషయం చాలా మందికి తెలియదు.
ఉదయం నిద్ర లేవగానే ఓ గ్లాసు నీళ్లు తాగాలి. అందులో నిమ్మకాయ, తేనె కలుపుకుంటే మంచిది. దీంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య లేకుండా పోతుంది. నిరంతరం యోగా, వ్యాయామం వంటివి చేస్తుండాలి. దీంతో మన శారీరక వ్యవస్థ బాగుంటుంది. తద్వారా మనం అందంగా కనిపించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
స్నానం చేసేందుకు కొబ్బరి పాలు కలిపిన నీళ్లు వాడుకోవాలి. దీంతో మన శరీరం మెరుస్తూ ఉంటుంది. రోజంతా హుషారుగా ఉండేందుకు కొబ్బరి నీళ్లు తాగుతుండాలి. ఇంకా గ్రీన్ టీ తీసుకుంటే కూడా ఎంతో బాగుంటుంది. ఇలా మన ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటిస్తే అందంగా కనిపించడం జరుగుతుంది. ఇలా వీటిని తీసుకోవడం ద్వారా అందమనేది దానంతట అదే వస్తుంది.
అల్పాహారంలో నూనె వస్తువులు తినకూడదు. డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. మిల్క్ షేక్ తీసుకుంటే ఇంకా మంచిది. అందులో అరటిపండు ఉంచుకోవాలి. ఇలా మనం రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటే అందం పెరుగుతుంది. అందంగా కనిపించడానికి వీలవుతుంది. ఇలా సహజసిద్ధమైన వాటితో మన అందాన్ని ఇనుమడింపచేసుకోవడం ఉత్తమం.