
కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. ఆలుమగల బంధంలో వారిద్దరిది ప్రత్యేకమైన శైలి. ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకుంటారు. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవస్తారు. ఇలా సంసారంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా వారు సునాయాసంగా దాటుకుని వెళ్తారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య అనురాగం కలకాలం నిలవాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరి. జీవితాంతం మన వెంట భార్య నిలుస్తుంది.
రోజుకో ఐలవ్ యూ
ప్రేమించిన కొత్తలో, పెళ్లయిన తొలినాళ్లలో ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలు బలంగా ఉంటాయి. ఒకరిని విడిచి మరొకరు ఉండరు. ఇద్దరు ప్రేమబంధంలో ఇమిడిపోతుంటారు. కాలం గడుస్తున్న కొద్దీ బాధ్యతలు పెరిగి భార్యపై ప్రేమ తగ్గిస్తుంటారు. దీంతో ఇద్దరి మధ్య తగాదాలు రావడం సహజమే. ఇలాంటి దూరాన్ని తగ్గించేందుకు రోజుకోసారి ఐలవ్ యూ చెబితే పులకరిస్తుంది. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది.
వెనకటి రోజులు
గడిచిన రోజులు గుర్తు చేసుకుని ఇద్దరు కలిసిపోవాలి. తమ మధ్య ఉన్న ప్రేమను గుర్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేయాలి. అప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. వారాంతంలో హాలిడే ట్రిప్పులకు వెళ్లాలి. అక్కడ భాగస్వామితో ప్రేమగా మాట్లాడాలి. దీంతో ఇద్దరిలో ఏకాంతం చూసుకుని మనసు విప్పి మాట్లాడుకుంటే మునుపటి రోజులు గుర్తుకు వస్తాయి.
అప్పడప్పుడు బహుమతులు
భార్యకు అప్పుడప్పుడు బహుమతులు ఇస్తుండాలి. దీంతో కూడా ఇద్దరి మధ్య అనుబంధం చిగురిస్తుంది. భార్యే కదా అనే నిర్లక్ష్యం వద్దు. ఇద్దరి మధ్య ప్రేమ పెరగాలంటే కలిసి మాట్లాడుకోవడం మంచిది. అప్పుడు మీ మధ్య ఏ విషయం కూడా చిచ్చుపెట్టదు. ఎంతటి కోపాన్ని అయినా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇలా మన కోసం త్యాగాలు చేసే భార్యలను చూసుకోవాల్సిన పద్ధతి.






