
Eat Breakfast : మనం రోజు ఉదయం పూట చేసే అల్పాహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. చాలా మంది పూరీ, వడ, బోండాలు తింటుంటారు. ఇవి ఆయిల్ తో చేసినవి కావడంతో త్వరగా జీర్ణం కావు. దీంతో అజీర్తి సమస్య పెరుగుతుంది. దీనివల్ల మనకు తిన్నది అరగక ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే టిఫిన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.
అల్పాహారంలో మిల్లెట్స్ చాలా మంచివి. మిల్లెట్స్ అంటే అరికెలు, కొర్రలు, అండుకొర్రలు లాంటివి తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో ప్రొటీన్లు బాగుంటాయి. మిల్లెట్స్ దాలియా తయారు చేసుకోవాలి. మిల్లెట్స్ తయారు చేసే దాలియా ఆరోగ్యానికి ఎంతో మంచిది.
అర కప్పు మిల్లెట్స్ ను నాలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి. ఇప్పుడు కుక్కర్ లో ఒక కప్పు నీళ్లు తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి మిల్లెట్స్ వేయాలి. 4-5 విజిల్స్ వచ్చే వరకు ఆగాలి. ఇప్పుడు మరో ప్యాన్ లో ఒకటిన్నర కప్పు పాలు తీసుకుని ఇందులో ఉడికిన మిల్లెట్స్ వేయాలి. పైన కొద్దిగా ఇలాచీ పౌడర్ వేయాలి.
తరువాత పాలలో కొద్దిగా ఉడకనివ్వాలి. రుచి కోసం బెల్లం వేసి గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ , దానిమ్మ గింజలు వేస్తే బాగుంటుంది. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో అల్పాహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుని మంచి రుచికరమైన పోషకాహారం తీసుకుని బలం వచ్చేందుకు ప్రయత్నించాలి.