
Sarath Babu born : వెటరన్ యాక్టర్ శరత్ బాబు అంటే మన టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియా భాషల్లో అందరికి పరిచయమే.. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించారు.. 1951లో శరత్ బాబు జన్మించగా ఈయన 22వ ఏట 1973లోనే నటన మీద ఉన్న మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు..
ఈయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, మూడుముళ్ల బంధం, ఆపద్బాంధవుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.. ఇక శరత్ బాబు 5 దశాబ్దాలుగా సౌత్ లోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా పలు సినిమాలు చేసి మెప్పించారు.
శరత్ బాబు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ఈయన చివరి చిత్రం నరేష్ – పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి.. ఈ సినిమాలో ఈయనను చివరిసారిగా చూడబోతున్నాం.. ప్రస్తుతం శరత్ బాబు వయసు 71 సంవత్సరాలు. ఈయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు..
దాదాపు 2 నెలలుగా ఈయన అనారోగ్యంగా బాధ పడుతు ఈ రోజు కన్నుమూశారు.. ఇక ఈయన కెరీర్ పరంగా బాగానే ఉన్న పర్సనల్ లైఫ్ లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.. ఈయన మొదటి భార్య రమాప్రభ ను ప్రేమించి పెళ్లి చేసుకుని మరీ ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు.. ఏది ఏమైనా శరత్ బాబు శకం ఇండస్ట్రీలో ఈ రోజుతో ముగిసింది అనే చెప్పాలి.. ఈయనకు మనం కూడా నివాళులు అర్పిద్దాం..