KCR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. బడ్జెట్ సమావేశాల్లో చర్చలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 10న బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ సమావేశానికి మాజీ సీఎం కేసీఆర్ రానున్నారని తెలుస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారోనని అందరు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ నిర్ణయంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ జారి పడటంతో తుంటి ఎముక విరిగింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఇంటిలో విశ్రాంతి తీసుకున్నారు. అసెంబ్లీ ప్రారంభమై ఇన్ని రోజులైన తాను మాత్రం అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ రాక కోసం వేచి చూస్తున్నారు. కేసీఆర్ వస్తే అసెంబ్లీ తీరు వేరుగా ఉంటుందని భావిస్తున్నారు.
అధికార పక్షం విమర్శలను తిప్పొ కొట్టడంలో కేసీఆర్ ఎలాంటి వాగ్బాణాలు వదులుతారోనని చూస్తున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని చేస్తున్న విమర్శలకు కేసీఆర్ ఘాటైన సమాధానాలు చెబుతారని అంటున్నారు. కాంగ్రెస్ చేస్తున్న వాటికి సరైన సమాధానాలు ఇస్తూ వారిని కట్టడి చేసే పనికి పూనుకుంటారని చెబుతున్నారు.
బీఆర్ఎస్ నేతల అహంకార పూరిత మాటలకే పరాజయం పాలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికి కూడా వారిలో ఓటమి భారం కనిపించడం లేదు. మా పాలనే కరెక్ట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వస్తే చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ను కాపాడుకోవాలంటే అధినేత అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు.