Animals Night Vision : ప్రపంచంలో అనేక జీవజాతులున్నాయి. ఒక్కో జీవిది ఒక్కో ప్రత్యేకత. వాటి సహజత్వంతో కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. కొన్ని జంతువులు రాత్రుళ్లు తిరుగుతాయి. ఇంకా కొన్ని జంతువులు పగలు తిరుగుతుంటాయి. వాటి మనుగడ కోసం అవి ప్రయత్నిస్తుంటాయి. ఈ నేపథ్యంలో టార్సియర్ అనే జీవిది ప్రత్యేకత కలిగిన లక్షణాలుంటాయి. దీని ఒక కన్ను మెదడుతో సమానంగా ఉంటుంది. ఇవి మనుషుల్లా 90 డిగ్రీల్లో ఉన్న వాటిని చూడలేవు. పక్కన ఉన్న వాటిని చూడాలంటే పూర్తిగా తిప్పాల్సి ఉంటుంది.
టాన్సియర్ నిర్మాణం గమ్మత్తుగా ఉంటుంది. ఒకే రంగులో ప్రతీది చూస్తాయి. ఎంత చీకటిగా ఉన్నా కీటకాలను చూడగలుగుతాయి. వాటి కళ్లు భయంకరంగా ఉంటాయి. వీటి దాడి నుంచి ఏదీ తప్పించుకోలేదు. రాత్రిపూట చూడగలిగే నైట్ విజన్ అద్దాల్లా ఉంటుంది. వెలుతురు లేకున్నా చూడగలిగే జంతువులు కూడా ఉంటాయి. థ్రెడ్ ఫిన్ డ్రాగన్ ఫిష్. ఇవి సూర్యకాంతి చేరని సముద్రపు ప్రాంతంలో ఈ చేప కనిపిస్తుంది. దీని శరీరంలోని దిగువ భాగం ఒక రకమైన కాంతిని కలిగి ఉంటుంది.
గుహలలో నివసించే జీవులు కూడా ప్రత్యేకతను చూపుతాయి. అక్కడ రాత్రి కాంతి తక్కువగా ఉంటుంది. సముద్రం కింద గుహల్లో నివసించే రిమ్ పేడ్ లాగా ఉంటుంది. ఇది పూర్తిగా గడ్డిలో పొడవాటి యాంటెన్నా, ఒక తెరను కలిగి ఉంటుంది. ఇవి వేటగాడు తన దగ్గరకు వస్తే గుర్తు పడతాయి. ఇలా జంతువుల లక్షణాలు భిన్నంగా ఉండటం సహజమే.
ఇలా జంతువులు ప్రత్యేక లక్షణాలతో వాటి ప్రాణాల్ని కాపాడుకుంటాయి. ఇతర జంతువుల, మనుషుల వేటనుంచి తప్పించుకుంటాయి. వాటి మనుగడ కోసం పాటుపడతాయి. జీవించడానికే ప్రాధాన్యం ఇస్తుంటాయి. వాటి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. జంతువుల మనుగడకు మనుషులు ప్రమాదం తలపెట్టకుండా ఉంటే మంచిది.