Beer : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మద్యం తాగుతుంటారు. అనేక బ్రాండ్లను ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా బీర్లు తాగే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. మద్యం అమ్మకాల ద్వారా దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. చాలా మంది కష్టపడి రాత్రి కాగానే మందు తాగనిదే నిద్ర కూడా పోని పరిస్థితి ఉంది.
దేశ వ్యాప్తంగా ఏ బీర్లు ఎక్కువగా తాగుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. ఇండియాలో మద్యం ప్రియులు అత్యధికంగా 5 రకాల బీర్లను తాగుతున్నారు. వారు తాగే బీర్లలో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. దేశంలో ఎక్కువ మంది తాగే బీర్లలో బడ్ వైజర్ బీర్ ది అయిదో స్థానం. ఈ బీరును దాదాపు 2 శాతం మంది మద్యం ప్రియులు ఇష్టంగా తాగుతున్నారు. చాలా మంది దీన్ని సూపర్ బ్రాండ్ అని విశ్వసిస్తున్నారు.
మరో బీర్ బ్రాండ్ కళ్యాణి బ్లాక్ లేబుల్.. ఇది యునైటెడ్ బ్రూవరీస్ కు గ్రూప్స్ కు చెందినది. దీన్ని ఎక్కువగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తాగుతున్నారు. ఈ బీర్లకు పశ్చిమ బెంగాల్‌తో పాటు తూర్పు రాష్ట్రాల్లో కూడా చాలా క్రేజీ ఉంది. అత్యధిక మంది తాగే బీర్లలో కళ్యాణి బ్లాక్ లేబుల్ బీర్ నాలుగో స్థానంలో ఉంది. 2.7 శాతం మంది దీన్ని ఇష్టంగా తాగుతున్నారు.
బ్రేవరీస్ కంపెనీ నుంచి దాదాపు 150 రకాల బీర్లు అందుబాబులో ఉన్నాయి. ఈ కంపెనీ దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే నాక్ అవుట్ బ్రాండ్ బీర్లను ఉత్పత్తి చేస్తూ సప్లై చేస్తోంది.
ఈ బీర్ 3వ స్థానాన్ని కలిగి ఉండగా.. దాదాపు 8.7 శాతం మంది ఈ బీర్లను తాగుతున్నారు.
ఏబీ మిల్లర్ కంపెనీకి చెందిన హేవర్డ్స్ బ్రాండ్ బీర్లను చాలా మంది పేదవారు ఇష్టంగా తాగుతారు. దీంతో ఈ బీర్ దేశంలో రెండో స్థానంలో కొనసాగుతుంది. దాదాపు మద్యం తాగే వారు 15 శాతం మంది ఈ బీర్ ను ఇష్టంగా తాగుతున్నారు.
ఇక అన్నిరాష్ట్రాల్లో అమ్ముడయ్యే బీర్ కింగ్ ఫిషర్. దీన్ని 1857 లో ప్రవేశపెట్టగా.. దీన్ని విజయ్ మాల్యా 1978 లో తిరిగి కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్ గా ప్రారంభించారు. దేశంలో అత్యధిక మంది తాగే బీర్లలో ఇది ఒకటి. దాదాపు 41 శాతం మంది తాగుతున్నారు. దీని ఓనర్ విజయ్ మాల్యా బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్ల రుణాలను తీసుకుని ఇండియా నుంచి విదేశాలకు పారిపోయాడు. ఈయనపై లుక్ అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో తల దాచుకుంటున్నాడు.