Parama Ekadashi : హిందూమతంలో ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏకాదశి నెలకు రెండు వస్తాయి. పరమ ఏకాదశి మాత్రం మూడేళ్లకు ఒకసారి వస్తుంది. అది అధిక మాసంలోనే వస్తుంది. దీంతో ఈ రోజు ఉపవాసం చేస్తే వేయి యాగాలు చేసిన పుణ్యం వస్తుందని చెబుతుంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల మన ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.
అధిక మాసంలో వచ్చే ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువును కొలిస్తే ఎల్లకాలం నుంచి వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. పరమ ఏకాదశి తిథి ఆగస్టు 11 న ప్రారంభమై ఆగస్టు 12 శనివారం రోజు ఉదయం 8.30 గంటలకు ముగుస్తుంది. ఈ రోజు నిష్టతో ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
ఆగస్టు 12 శనివారం రోజే ఉపవాసం చేయాలంటున్నారు. ద్వాదశి తిథి ఆగస్టు 12న మొదలై ఆస్టు 13 ఆదివారం ఉదయం 8.30 గంటలకు ముగుస్తుంది. మూడేళ్లకు ఒకసారి వచ్చే పుణ్యకాలం కావడంతో ఈ రోజుకు విశిష్టత ఏర్పడింది. ఈ రోజు నిష్టతో ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. పరమ ఏకాదశి పురాణం వింటే ఇంకా మంచి జరుగుతుంది. పుణ్యఫలం దక్కనుండటంతో అందరు ఈరోజు ఉపవాసం చేయడం చాలా మంచిది.
పరమ ఏకాదశి వ్రతం ఆచరించే వారు బ్రహ్మముహూర్తంలో తలస్నానం చేసి ధ్యానం చేయాలి. చేతిలో పువ్వులతో విష్ణువు ఎదుట ఉపవాసానికి రెడీ కావాలి. పీఠంపై ఎరుపు వస్త్రం ఉంచి దానిపై విష్ణు మూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించి ఎదురుగా కూర్చుని పూజ చేయాలి. అనంతరం స్వామి వారికి నైవేద్యం సమర్పించాలి. తరువాత హారతి ఇచ్చి విష్ణు సహస్ర నామాన్ని జపించాలి. పుష్పమో పత్రమో దానం చేసి పండు తినొచ్చు.