
calcium rich : మనకు ఎముకలు బలంగా లేకపోతే నొప్పులు వస్తుంటాయి. మోకాళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఇబ్బందులు పెడతాయి. ఈ నొప్పులు రావడానికి ప్రధాన కారణం కాల్షియం లోపం. మనకు కాల్షియం అందించే ఆహారాలు ఎన్నో ఉన్నాయి. పాలల్లో కాల్షియం ఉంటుందని అందరు పాలు తాగుతారు. కానీ పాలకంటే నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు.
కాల్షియం అందించే ఆహారాల్లో పాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి గింజల్లో ఉంటుంది. దీంతో వీటిని తీసుకోవడం వల్ల మంచి లాభాలుంటాయి. చియా గింజలను తీసుకుంటే వంద గ్రాముల గింజల్లో 631 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. ఇలా మనకు చాలా ఆహారాల్లో కాల్షియం ఉంటుంది.
బ్రోక్ లీ లో కూడా విటమిన్ సి తోపాటు కాల్షియం మెండుగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కాల్షియం లోపం లేకుండా పోతుంది. ఇది ఏడాది పొడవున అందుబాటులో ఉండకున్నా దొరికినప్పుడు తినడం మంచిదే. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల మనకు లాభాలు మెండుగా ఉంటాయి.
కాల్షియం బాగా లభించే ఆహారాల్లో బాదం పప్పు కూడా ఉంటుంది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండటంతో వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారిపోతాయి. ఇలాంటి ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దీని వల్ల మనం కాల్షియం లోపం నుంచి బయట పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.