Biggest nose : థామస్ వెడ్డర్స్ వాడ్ హౌస్ అనే వ్యక్తి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి చనిపోయిన తర్వాత ఎక్కాడు. అసలు ఆయన ప్రత్యేకత ఏంటి? అంతలా ఏం సాధించాడో తెలిస్తే మనం ముక్కున వేలేసుకోవాల్సిందే.. అవును ముక్కు గురించి మాట్లాడుకోవాలి. ప్రపంచంలోని అత్యధిక పొడువైన ముక్కు కలిగి ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా.. లండన్ లోని యార్క్ షైర్ లో 1730 సంవత్సరంలో థామస్ వెడ్డర్స్ అనే పొడువాటి వ్యక్తి జన్మించాడు. ఎవరికైనా ముక్కు ఎంత సైజులో ఉండాలో అంతే ఉంటుంది.
కానీ ఇతడికి మాత్రం ఒక రేంజ్ లో పొడువుగా ఉంది. ఈ ముక్కు వల్ల ఆయన తన జీవితంలో ఎంతో కష్టపడ్డాడు. ఈయన పడిన కష్టం ఎవరికీ రాకూడదని అనేక మంది చాలా మంది అంటుంటారు. లండన్‌లోని రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో ఈ పొడవటి ముక్క కలిగిన వ్యక్తి బొమ్మ ఇప్పటికే ఉంచారు. దీన్ని చాలా మంది ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ ముక్కు ఇలా ఎలా పెరిగిందో సాధ్యం కావడం లేదని శాస్త్రవేత్తలు కూడా తలలు పట్టుకున్నారు. కాగా జన్యు పరమైన లోపాలే ఇలా పెరగడానికి కారణం అని అంటున్నారు.
థామస్ ముక్కు దాదాపు 7.5 అంగుళాలు ఉండేదన్నారు. మొత్తం 19 సెంటీ మీటర్లు ఉంటుందన్న మాట. థామస్ 18 వ శతాబ్ధంలో సర్కస్ లో పని చేసేవాడని ప్రాచుర్యంలో ఉంది. మైనపు విగ్రహం రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో ఉంచారు దీన్ని చూడడానికి ఎంతో మంది ఇప్పటికీ వస్తున్నారు. దీని గురించి తాజాగా ట్విటర్ లో ఒక వినియోగ దారుడు పెట్టడంతో దీని గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. అయితే ఇంతటి ముక్కు వల్ల ఆయన చాలా కష్టాలు పడే ఉంటాడని అనుకుంటున్నారు. ప్రపంచంలో ఇంతటి పొడవాటి ముక్కు ఉన్న వ్యక్తి మైనపు బొమ్మను తయారు చేసి ఒక మ్యూజియంలో ఉంచడం ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తోంది.
View this post on Instagram