
Do you know who is Rashi’s husband ?
తెలుగులో చాలా మంది బాల నటులుగా వచ్చి హీరోయిన్లు అయ్యారు. అందులో శ్రీదేవి, మీనా, రాశి ఉన్నారు. రాశి 1986లో మమతల కోవెల సినిమాలో బాలనటిగా ప్రవేశించింది. బాలకృష్ణ హీరోగా నటించిన బాలగోపాలుడు సినిమాలో కూడా నటించింది. ఇక1997లో శుభాకాంక్షలు సినిమాలో జగపతి బాబుకు జోడిగా నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం.
తరువాత గోకులంలో సీత, పెళ్లిపందిరి, స్నేహితులు, పండగ, గిల్లికజ్జాలు, దేవుళ్లు వంటి సినిమాలు చేసింది. మహేశ్ బాబు నిజం సినిమాలో నెగెటివ్ పాత్రలో కనిపించింది. ఇలారాశి ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో మెప్పించింది. శ్రీకాంత్ తో నటించిన ప్రేయసి రావే సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. బాలనటిగా వచ్చి హీరోయిన్ గా తనదైన శైలిలో నటించింది.
ప్రస్తుతం జానకి కలగనలేదు అనే సీరియల్ లో నటిస్తోంది. 2020లో గిరిజ కల్యాణం అనే సీరియల్ లో ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెర మీద కూడా తన ముద్ర వేస్తోంది. 2005లో ఎస్ఎస్ నివాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసారం మొదలు పెట్టింది. ఎందరో బిజినెస్ మేన్ లు తన వెంట పడినా చివరకు అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది.
ముద్దుగా బొద్దుగా ఉండే రాశి భర్త, పిల్లలతో కలిసి ఉన్న ఫొటోలు పెడుతూ వైరల్ గా నిలుస్తోంది. హీరోయిన్లు ఎప్పటికైనా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాల్సిందే. అదే కోవలో రాశి కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంది. వయసు పెరిగాక పెళ్లి చేసుకోవాలనుకున్నా కుదరదు. అందుకే ముందే పెళ్లి చేసుకుని సెటిల్ కావడంతో తన సంసారంలో సాఫీగా సాగిపోతోంది.






