Saitan Bold actress : తిన్నగా సాగిపోతే కిక్కేముంది అనుకున్నాడో ఏమో డైరెక్టర్ మహి వీ రాఘవ్. ‘సైతాన్’తో పిచ్చెక్కించాడు. ప్రతీ సన్నివేశం బూతుతోనే మొదలవుతుంది.. బూతుతోనే పనూర్తవుతుంది. తాను గతంలో తీసిన యాత్ర, ఆనందో బ్రహ్మ తీసి ఇండస్ట్రీలో పాతుకుపోయాడు. మంచి ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక తర్వాత వెబ్ సిరీస్ లోకి వచ్చి ‘సేవ్ ద టైగర్స్’ తీశాడు. ఇది ఆయనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇందులో ఎలాంటి హద్దులు దాటలేదు. ఒకటి రెండు చోట్ల సాధారణంగా వాడుకలోనే ఉన్న బూతులు ఉపయోగించినా పర్వాలేదనిపించాడు.
ఇక ‘సైతాన్’ వెబ్ సిరీస్ కు వచ్చిన ఆయన డిఫరెంట్ గా చేశాడు. సెక్స్ సెన్స్, బూతులు, హింసా వంటి వాటినే హైలెట్ చేశాడు. ఇది చూసిన వ్యూవర్స్ మొదట్లో తిట్టుకున్నా.. తర్వాత లైట్ తీసుకున్నారు. సేవ్ ద టైగర్ అంత కాకున్నా బూతులు, సెక్స్ సీన్స్ తో యువతను కొంచెం తన వైపునకు తిప్పుకోగలిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఇందులో హీరో చెల్లెలి క్యారెక్ట్ వేసిన నటి ఎవరో గుర్తు పట్టారా.? ఆమె బ్యాగ్రౌండ్ గురించి చెప్పుకుందాం.
సైతాన్ లో హీరోకు చెల్లెలిగా చేసిన నటి పేరు ‘దేవియాని శర్మ’. బోల్డ్ యాక్టింగ్ లో ఇరగదీసింది దేవియాని. పాత్రోచితంగా చాలా చోట్ల బూతులు కూడా అవలీలగా మాట్లాడింది. ఈమె సేవ్ ద టైగర్ వెబ్ సిరీస్ లో కూడా నటిచింది. చైతన్య కృష్ణకు భార్యగా, లాయర్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. ఇక సైతాన్ లో ఆమెను బోల్డ్ క్యారెక్టర్ ను చూసేందుకు యువకులు మళ్లీ మళ్లీ చూస్తున్నారంటే సందేహం లేదు.
దేవియాని శర్మ ఢిల్లీలో 30 మే, 1993లో హిందూ కుటుంబంలో జన్మించింది. అక్కడే స్కూల్, కాలేజీ చేసింది. తర్వాత మోడలింగ్ రంగం వైపునకు వచ్చింది. కొన్ని బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. తర్వాత హైదరాబాద్ కు వచ్చింది. తన మొదటి చిత్రం 2016లో వచ్చిన ‘లవ్ షుదా’. 2020లో ‘భానుమతి & రామకృష్ణ’తో గుర్తింపు దక్కించుకుంది. తర్వాత 2021లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘రొమాంటిక్’ సినిమాలో గెస్ట్ ఆర్టిస్ట్ గా చేసింది.
దేవియాని శర్మ వెబ్ సిరీస్ విషయానికి వస్తే 2020లో జీ ఒరిజినల్ నిర్మించిన ‘అనగనగా’ మొదటి సిరీస్. 2021లో ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’, 2023లో ‘సేవ్ ద టైగర్స్’ ‘సైతాన్’లో నటించింది.
ReplyForward
|