IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సంరంభం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికి గాను ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. క్రీడాకారులకు రూ.కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యాయి. మార్చి 22 ఐపీఎల్ పండగ ఆరంభం కానుంది. ఇప్పటికే 16 సీజన్ లు పూర్తి చేసుకున్న ఐపీఎల్ 18వ సీజన్ కు సమాయత్తం అవుతోంది. తమ సత్తా చాటాలని అన్ని జట్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. గెలుపు గుర్రాలను సొంతం చేసుకోవాలని భారీగానే నగదు పెట్టనున్నాయి.
ఐపీఎల్ లో పది టీములున్నాయి. ఇందులో ఒక్కో టీమ్ కు ఒక్కో కెప్టెన్ ఉంటాడు. ఇందులో రాహుల్ ద్రవిడ్ కూడా లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్. అతడికి రూ. 17 కోట్ల పారితోషికం ముట్టజెపుతున్నారు. మేనేజ్ మెంట్ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాహుల్ రెండు సార్లు ప్లే ఆప్స్ కు చేర్చడం గమనార్హం. అలా ఐపీఎల్ కెప్టెన్లలో అత్యధిక ధనవంతుడిగా రాహుల్ కు గుర్తింపు దక్కింది.
రాహుల్ తరువాత స్థానం విరాట్ ది. ఇతడు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకు సారధ్యం వహిస్తున్నాడు. ఇతడికి కూడా రూ. 17 కోట్లు మాట్లాడుకున్నా రూ.15 కోట్ల వరకు ముడుతున్నాయి. నిరుడు కెప్టెన్ గా వైదొలిగాక విరాట్ కు ఇచ్చే పారితోషికం తగ్గింది. రాహుల్ ద్రవిడ్ తరువాత అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాడిగా కోహ్లికి స్థానం దక్కుతుంది. తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్ రూ. 16 కోట్లు అందుకుంటున్నాడు.
తరువాత చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఎంఎస్ ధోని రూ. 12 కోట్లు తీసుకుంటున్నాడు. కోల్ కతా నైట్ రైజర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా రూ. 12.25 కోట్లు అందుకుంటున్నాడు. పంజాబ్ కింగ్స్ సారధి శిఖర్ ధావన్ రూ. 8.25 కోట్లు తీసుకుంటున్నాడు. గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్ శుభ్ మన్ గిల్ రూ. 8 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఆర్సీబీ సారధి డూప్లెసిన్ రూ. 7 కోట్లు, హైదరాబాద్ సన్ రైజర్స్ నాయకుడు ఎడెన్ మర్క్ రమ్ రూ. 2.6 కోట్లు దక్కించుకుంటున్నాడు.