21 C
India
Sunday, February 25, 2024
More

    90’s Multi Starrer Movie : 90’s మల్టీ స్టారర్ సినిమా ఎందుకు ఆగిందో తెలుసా?

    Date:

    90's Multi Starrer Movie
    90’s Multi Starrer Movie

    90’s Multi Starrer Movie : 90 వ దశకం నుంచి ఇండస్ట్రీకి కొత్త రక్తం వచ్చింది. 80వ దశకంలోని హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్, శోభన్ బాబు లాంటి హీరోలు మెల్ల మెల్లగా తెరమరుగు అవుతూ వచ్చారు. వారి స్థానాన్ని బాలయ్య బాబు, నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్ భర్తీ చేశారు. ఈ హీరోల ట్రెండ్ యమా స్పీడుగా మొదైలంది.

    నలుగురు యంగ్ స్టార్లు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో 1998లో వారితో మల్టీ స్టారర్ సినిమా చేసి ఇండస్ట్రీలో ఒక భారీ రికార్డు సాధించాలని చాలా మంది దర్శకులు అనుకున్నారు. కానీ ఆ ఛాన్స్ దాసరి నారాయణ రావు కొట్టేశారు. అప్పట్లో ఆయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువయ్యేవి. ఇండస్ట్రీలో దర్శకరత్నగా మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ నలుగురితో సినిమా చేయాలని ఆయన అనుకున్నాడు. దానికి సంబంధించిన కథను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆ కథను నలుగురు హీరోలకు వివరించారు. వారంతా కథ బాగుందని, చేద్దామని చెప్పారు. కానీ అది కాస్తా పట్టాలెక్కకుండానే పక్కకు వెళ్లింది.

    దాసరి నారాయణ రావు ఈ నలుగురు హీరోలకు చెందిన అభిమానులను వేర్వేరుగా పిలిచి మాట్లాడారట. వారిలో కొందరు మా హీరోను తక్కువ చేసి చూపిస్తే బాగుండదని, మా హీరోను తక్కువ చేసి చూపిస్తే అస్సలు బాగుండదని వార్నింగులు ఇచ్చారట. సినిమా అంటే హీరో ఉంటాడు.. అలాగే విలన్ కూడా ఉంటాడు.. హీరో విలన్ కాకుండా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ అంటే ఇంట్లో అందరూ హీరోలా ఉన్నట్లు తీయడం, లేదంటే విలన్లుగా ఉన్నట్లు తీయడం అస్సలు కుదిరేపని కాదు. కాబట్టి ఈ స్క్రిప్ట్ కు రాం రాం చెప్పడం మంచిదని భావించారట.

    కానీ ఈ నలుగురితో సినిమా చేస్తే ఇండస్ట్రీలో ఎంతటి బ్లాక్ బస్టర్ సినిమా అయ్యేదో అర్థం చేసుకోవచ్చు. వీళ్లని ఒకే ఫ్రేమ్ లో చూస్తే వాళ్ల అభిమానులకి కన్నుల పండుగ అనే చెప్పాలి. కానీ,  అది మిస్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నలుగురిలో ఏ ఇద్దరు హీరోలు కలిసి కూడా మల్టీస్టారర్ సినిమా చేయలేదు.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2023 Year Roundup : ఈ ఏడాదిలో వెండితెరపై కనిపించని ఈ హీరోలు..!

    2023 Year Roundup Box Office : ఈ సంవత్సరం (2023)...

    Top Heros Remuneration : రెమ్యునరేషన్ విషయంలో టాలీవుడ్ టాప్.. ఎవరికి ఎంతో తెలుసా?

    Top Heros Remuneration : ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు టాలీవుడ్ చలన...