
Birds Fly V shape : ఉదయం పూట, సాయంత్రం వేళ అయినా పక్షులు ఆకాశంలో ఎగురుతూ పోతుంటాయి. వాటిని చూస్తే మనకు గమ్మత్తుగా అనిపిస్తుంది. సంతోషం వేస్తుంది. అవి అలా ఎందుకు పరుగెడతాయి అనుకుంటాం. కానీ వాటి ఆహార సేకరణకు అవి ఎంతో దూరం వెళతాయి. మళ్లీ గూటికి చేరుకుంటాయి. అలా పక్షులు వెళ్లేటప్పుడు మజాగా అనిపిస్తుంది.
పర్యావరణ పరిరక్షణకు పక్షులు ఎంతో దోహదం చేస్తాయి. పక్షి సంపద అంతరించిపోతోంది. చాలా రకాల పక్షులు రేడియేషన్ సమస్యతో అంతర్థానం అవుతున్నాయి. ఉన్న పక్షుల్లో పిచ్చుకలు, కొంగలు మాత్రమే కనిపిస్తున్నాయి. రాబందులు మొత్తం కనిపించకుండా పోయాయి. గద్దలు కూడా కానరావడం లేదు. ఈనేపథ్యంలో పక్షులు కనిపించకుండా పోవడానికి చాలా రకాల కారణాలు కనిపిస్తున్నాయి.
పక్షులు ఆకాశంలో ఎగిరేటప్పుడు వీ ఆకారంలో వెళ్తుంటాయి. ఎందుకు అలా వెళతాయనే అనుమానాలు అందరికి రావడం సహజమే. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లేటప్పుడు పక్షులు ఇలా ఎగురుతుంటాయి. ఇలా ఎగరడం వల్ల వాటి శరీరంపై గాలి ఒత్తిడి పడకుండా అనుకూలంగా ఉంటుంది. వాటి శక్తి కూడా ఆదా అవుతుంది.
ఇలా వెళ్తే సహచర పక్షులను ఢీకొట్టే అవకాశం ఉండదు. ముందున్న పక్షికి అలసిపోయినప్పుడు వెనుక ఉన్న పక్షి ముందుకు వెళ్తుంది. ఇలా ఒక్కో పక్షికి ఆ గుంపునకు నాయకత్వం వహించే అవకాశం ఏర్పడుతుంది. ఇలా పక్షులు ఇతర ప్రాంతాలకు వెళ్లే సందర్భంలో ఇలా చేస్తుంటాయని చెబుతుంటారు. పక్షులకు కూడా చాలా విషయాల్లో వాటికి అనుకూలంగా ఆలోచిస్తాయని తెలుసు.