Actress Madhu Bala :
హిందీలోఫూల్ ఔర్ కాంటే సినిమాతో అజయ్ దేవగన్ తో నటించి పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ మధుబాల. తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది. తమిళంలో శంకర్ దర్శకత్వంలో జెంటిల్మెన్ సినిమాలో నటించింది. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రోజా సినిమాలో అరవింద స్వామితో నటించింది. దీంతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా ఆమె ఖ్యాతి పొందింది.
తెలుగులో కూడా నటించింది. అల్లరి ప్రియుడు సినిమాలో రమ్యకృష్ణతో పాటు నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలా తన అందంతో అందరిని మెప్పించింది. కానీ తరువా ఏమైందో కానీ పరిశ్రమకు దూరమైంది. ఇక తాను హీరోయిన్ గా చేయలేనని చెప్పేసింది. అందరికి లేఖలు కూడా రాసిందట. హీరోయిన్ గా రాలేనని ఘాటుగా చెప్పడంతో ఇక ఆమెను ఎవరు సంప్రదించలేదు.
ఇప్పుడు మనసు మార్చుకుని చిన్న చిన్న పాత్రలు చేస్తోంది. ఆమె నటించిన సినిమాలన్ని బ్రహ్మాండమైన హిట్లుగా నిలిచాయి. దీంతో ఆమెది గోల్డెన్ హ్యాండ్ గా చెప్పేవారు. అయినా ఎందుకో నటనకు గుడ్ బై చెప్పేసి చాలా కాలం ఎవరికి కనిపించకుండా పోయింది. ఇప్పుడు మాత్రం చిన్న పాత్రలు చేస్తూ మళ్లీ కెమెరా ముందుకు వస్తోంది. మధుబాల పరిశ్రమకు ఎందుకు దూరమైంది.
అప్పట్లో హీరోయిన్లకు అవకాశాలు అంతగా వచ్చేవి కావు. దీంతో ఆమె మనసు కలత చెంది సినిమాలకు దూరంగా ఉండిపోయిందని అంటుంటారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఇండస్ట్రీ విస్తృతమైంది. అవకాశాలు కూడా బోలెడు వస్తున్నాయి. అందుకే చాలా మంది మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. మళ్లీ కెమెరా ముందుకు రావడం గమనార్హం.