
Babies Cry : చంటి పిల్లలు ఆకలేసినా, ఏదైనా కావాలన్ని ఏడుపు లంకించుకుంటారు. దీంతో మనం అబ్బబ్బ వీడి ఏడుపు మనసును పట్టనివ్వడం లేదని అంటుంటాం. కానీ వారు ఏడ్చేటప్పుడు కంటి నుంచి నీరు అయితే రాదు. ఎంత ఏడ్చినా కళ్ల నుంచి నీరు రాకపోవడంతో వీడు ఎంత ఏడ్చినా కళ్ల వెంట చుక్క కూడా రావడం లేదని నవ్వుకుంటుంటాం. దీంతో వారి ఏడుపు ఆపేదెప్పుడని అనుకుంటాం.
చిన్న పిల్లలు ఏడ్చినా కన్నీరు రాకపోవడానికి కారణాలున్నాయి. చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి దాదాపు ఏడాది వరకు వారి శరీర అవయవాలు పెరుగుతుంటాయి. ఈ క్రమంలో వారు ఏడ్చినా కన్నీళ్లు రాకుండా ఉంటాయి. అవయవాలు పెరిగే క్రమంలో కన్నీళ్లు రాకుండా ఉండేందుకు కారణమవుతుంది. నవజాత శిశువు కంటి నుంచి నీరు రాకుండా చేస్తుందని తెలుస్తోంది.
పుట్టిన కొన్ని నెలల వరకు కన్నీళ్లు రావడానికి ఒక ప్రత్యేక వాహిక ఉంటుంది. దాని గుండా కన్నీళ్లు బయటకు వస్తాయి. నవజాత శిశువుల్లో ఇది పూర్తిగా డెవలప్ కాదు. దీంతో కొన్ని వారాల పాటు వారు ఏడ్చినా నీళ్లు రావు. అందుకే పిల్లలు ఏడ్చే సమయంలో కన్నీళ్లు రాకుండా ఉంటాయి. ఇలా శిశువుల కళ్లల్లో ఎంత ఏడ్చినా చుక్క నీరు కూడా రాదు.
ఇలా చంటి పిల్లలు ఏడ్చినా వారి కంట నీరు రాకుండా ఉంటుంది. ఇది మనకు ఆశ్చర్యం అనిపించినా నిజమే. నవజాత శిశువుల ఏడుపులో నీరు బయటకు రాదు. ఎంత సేపు ఏడ్చినా వారి కళ్ల వెంట నీరు రాకుండా వారి అవయవాలు తయారవుతాయి. దీంతో ఒక శిశువు ఎంత సమయం ఏడ్చినా ఇదే తీరుగా ఉంటుందని తెలుసుకోవాలి.