
స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైంది. ఎవరి చేతిలో అయినా స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. దీంతో ఫోన్ల వినియోగం పెరిగిపోతోంది. దీని వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిసినా మానడం లేదు. స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల దేశంలో అధిక శాతం మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ మధ్య హైదరాబాద్ లో ఓ మహిళ ఫోన్ వాడకంతో కంటి జబ్బు బారిన పడింది. రోజు చీకటిలో సెల్ చూడటం వల్ల ఆమె చూపు మందగించింది
ఫోన్ల బ్యాటరీ ఎందుకు పేలుతుంది
స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ ఎందుకు పేలుతుంది? దీనికి కారణం బ్యాటరీ హ్యాండ్ సెట్ లిథియం అయాన్ తో చేయబడి ఉంటుంది. దీని వల్ల బ్యాటరీ ఉబ్బడంతో పేలుతుందని గుర్తిస్తున్నారు. బ్యాటరీ ఉబ్బినట్లయితే వెంటనే బ్యాటరీ తీసివేయాలి. కొత్త బ్యాటరీ వేయాల్సిందే. లేకపోతే అది ఎప్పుడైనా పేలే ప్రమాదం ఉంటుంది. బ్యాటరీ లోపల ఉండే భాగాలు సమస్యలకు గురై పేలుడుకు దారితీసే అవకాశం ఏర్పడుతుంది.
వేడి కారణంగా..
ఫోన్ ఎక్కువ వేడి అయినా కూడా పేలుతుంది. మనం ఎప్పుడు గుర్తించాలి. ఎండలో ఎక్కువ సేపు ఉంచడం కూడా మంచిది. ఎండలో ఉంటే ఫోన్ వేడికి గురవుతుంది. దీని వల్ల కూడా పేలుడు సంభవిస్తుంది. థర్మల్ రన్ అనే చైన్ రియాక్షన్ వల్ల బ్యాటరీ ఎక్కువ వేడికి గురవుతుంది. దీని వల్ల బ్యాటరీ పేలిపోతుంది. ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదే.
ఎందుకు వేడవుతుంది
పోన్ ను ఎక్కువగా ఎండలో ఉంచడం వల్ల వేడవుతుంది. ఎక్కువ కాలం వాడిన ఫోన్లు కూడా అంతర్గతంగా చెడి పోతుంది. దీని వల్ల బ్యాటరీ ఉబ్బి పేలిపోతుంది. కొన్ని సందర్భాల్లో కంపెనీ ఇచ్చిన బ్యాటరీ అయినా చెడిపోతే అంతే సంగతి. ఇలా ఫోన్ల బ్యాటరీలు చెడిపోవడం వల్ల పేలుతుంటాయి. ఇలా పేలినప్పుడు ఫోన్ దగ్గర ఉంటే ప్రమాదం జరుగుతుంది.






