Famous astrologer : సోషల్ మీడియా పుణ్యమా అని మనం గతంలో చూడని, ఊహకు కూడా అందని ఫొటోలను అప్పుడపప్పుడూ చూస్తుంటాం. వాటి గురించి తెలినప్పుడు ఆశ్చర్యం వేయక మానదు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వేటికి పొంతన ఉండదు. కానీ ఒకే వ్యక్తి బాల్యంలో ఇలా ఉండేవాడు.. ఇలా అయ్యాడంటే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే. పైగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఫొటో పోస్ట్ చేయడం ఎవరని ప్రశ్నించడం దీంతో నెటిజన్లు సైతం వారి బుర్రకు పదును పెడుతున్నారు.
తాజాగా ఒక జ్యోతిష్యుడు తన పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆయన ఇన్ స్టాలో ఈ ఫొటోను అప్ లోడ్ చేశాడు. ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఆయన ఇద్దరు హీరోయిన్ల మధ్య తీసుకున్న ఫొటో ఇప్పుడు అందరూ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ జ్యోతిష్యుడు ఎవరు అనుకుంటున్నారా చదవండి మీకే తెలుస్తుంది.
సెలబ్రెటీ జ్యోతిష్యుడిగా వేణు స్వామికి మంచి గుర్తింపు ఉంది. సినిమాలు హిట్లా, ఫట్టా, తారలు, సెలబ్రెటీల వైవాహిక జీవితం, వారి జీవితాల్లో వచ్చే గండాలు, తదితర వివరాలు చెప్తుంటాడు. ఇవి కాస్తా వైరల్ గా మారుతుంటాయి. ‘తాను యుక్త వయస్సులో ఉన్న సమయంలో సినిమాలకు ముహూర్తాలు పెట్టేవాడినని, ప్రొడక్షన్ పనులను సైతం చూసుకునే వాడిని’ అని ఆయన అప్పుడప్పుడు చెప్తుంటాడు. దీనికి నిదర్శనమే ఈ పిక్.
ఇప్పుడు ఆయన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 1993 లో ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా సమయంలో తీసిన ఫొటో ఇది. ఇటీవల ఆయన బర్త్ డే సందర్భంగా సోదరుడు శ్యాం 1989 నుంచి సినిమా ఇండస్ట్రీ కానీ పొలిటికల్ జీవితంలో కానీ ఉన్న ఫొటోలు ఓ వీడియో రూపంలో రూపొందించారట. ఈ వీడియో తన ఇన్ స్టాలో షేర్ చేయగా వేణుస్వామికి ఇంత మందితో పరిచయాలు ఉన్నాయా? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
వేణుస్వామికి చాలా మంది సినిమా ప్రముఖులతో పరిచయాలున్నాయి. సీనియర్ హీరోలు, హీరోయిన్ల, రాజకీయ ప్రముఖుల ఇండ్లలో ఆయన శుభకార్యాలు చేయిస్తుంటారు. ఆయన కాంటాక్ట్ లిస్ట్ కూడా చాలా పెద్దదే. ఇప్పుడు ఈ ఫొటో వైరల్ అవ్వడంతో మరోసారి ట్రెండింగ్ అయ్యారు.
View this post on Instagram