Celebritiesఈ మధ్య సెలెబ్రిటీల చైల్డ్ హుడ్ పిక్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. సోషల్ మీడియా యువతకు బాగా చేరువ అయిన తర్వాత తమ ఫేవరేట్ తారల గురించి ఏ చిన్న విషయం వచ్చిన వదిలిపెట్టడం లేదు.. ఇక వారి చిన్ననాటి ఫోటోలు కనిపిస్తే వారిని సోషల్ మీడియా వేదికగా నిముషాల్లోనే వైరల్ చేసేస్తున్నారు.
తాజాగా ఇద్దరు అన్నదమ్ములు ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ అన్నదమ్ములకు ప్రజెంట్ టాలీవుడ్ బాగా క్రేజ్ ఉంది.. మరి ఆ అన్నదమ్ములు ఎవరా అని ఆలోచిస్తున్నారా? వారే దేవరకొండ బ్రదర్స్.. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ.. ఈ ఇద్దరు కూడా ఇప్పుడు మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో భారీ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు.
విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో మొదటి హిట్ అందుకుని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఈయన అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో భారీ క్రేజ్ తెచ్చుకుని లైగర్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ లైనప్ తో ఫ్యాన్స్ ను పలకరించడానికి సిద్ధం అవుతున్నాడు..
ఇక విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ.. అయితే ఈయనకు అన్న అంత గుర్తింపు రాకపోయినా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ ఇటీవలే వచ్చిన బేబీ సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి దిగిన చైల్డ్ హుడ్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.