
child star : సౌత్ సినిమాలకు రాను రాను క్రేజ్ మరింత పెరుగుతోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇలా సౌత్ సినిమాలు దేశాన్ని కాదు కాదు ప్రపంచాన్ని ఏలుతున్నాయంటే సందేహం లేదు. సినిమాలు హిట్ అయితే యాక్టర్స్ కూడా హిట్ అయినట్లే కదా. సౌత్ నుంచి చాలా మంది యాక్టర్స్ బాలీవుడ్ లో సైతం గుర్తింపు దక్కించుకుంటున్నారు. అయితే అందులో హీరోయిన్స్ కూడా ఏం తక్కువ కాదు. వారు కూడా బాలీవుడ్ లో తమ గుర్తింపు కోసం పాకులాడుతున్నారు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం ఇలా భాషలు ఏవైనా పోటీ పరంగా నార్త్ సౌత్ డివైడ్ అవుతూనే ఉంటాయి. అందులో గతంలో నార్త్ చలన చిత్ర లోకాన్ని ఏలితే.. ఇప్పుడిప్పుడే సౌత్ దాని పగ్గాలు పట్టుకునేందుకు పావులు కదుపుతుంది.
సౌత్ లో హీరోలకు ఉన్నట్లే హీరోయన్లకు కూడా ఫాలోయింగ్ ఎక్కువ. హీరోయిన్ తనకు నచ్చాలే కానీ గుడి కూడా కట్టేంత అభిమానం ఇక్కడి వారి సొంతం. గతంలో ఖుష్బూ, తర్వాత నమితి, నిన్న సమంత ఇలా అభిమానం కట్టలు తెంచుకుంటుంది మనవారిలో. ఇక హీరోయిన్స్ చిన్ననాటి ఫొటోలు, చిన్న నాటి గుర్తులు ఉంటే తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తుంటారు సౌత్ జనం. రష్మిక మందాన, కీర్తి సురేశ్, పూజా హెగ్డే ఇలా చాలా మంది హీరోయిన్ల చిన్ననాటి ఫొటోలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఇక్కడున్న ఫొటోతో చిన్ననాటి గుర్తులను తనతో పంచుకోవాలనుకుంటుంది ఎవరో కాదు నివేద పేతురాజ్. చూడచక్కని అందం ఆమె సొంతం. కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ఆమె గుర్తింపు సంపాదించుకుంది. యంగ్ హీరోలతో జతకట్టిన ఆమె వారికి తీసిపోకుండా నటించింది. హీరోయిన్ గానే కాదు ఫార్ములా వన్ రేసింగ్ లో కూడా అమ్మడు తన సత్తా చాటింది. మెంటల్ మదితో ఇండస్ట్రీకి పరిచయమైన నవేదా పేతురాజ్ చిత్రలహరితో ప్రేక్షకుల మనసు గెలిచింది. తర్వాత రెడ్, బ్రోచేవారెవరురా, పాగల్, చిత్రలహరి చిత్రాలతో తెలుగు వారికి మరింత దగ్గరైంది.